TTD: ఆలయాల అభివృద్ది చెయ్యాలని సీఎం వైఎస్ జగన్ డిసైడ్ అయ్యారు, డీసీఎం, పరిశీలించిన టీటీడీ ఈవో !
తిరుపతి/ తిరుమల: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహార్ రెడ్డి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
కె నారాయణ స్వామి తో కలిసి మంగళవారం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆలత్తూరు, కలికిరి కొండ, కార్వేటినగరం ఆలయాలను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలు అభివృద్ది చెయ్యాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసైడ్ అయ్యారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి తన నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో పలు అభివృద్ధి పనులు చేయాలని కోరినట్లు టీటీడీ ఈవో చెప్పారు. ఇందుకోసం తనను ఆలయాలను పరిశీలించాలని కోరారని, అందుకే ఈ రోజు ఇక్కడ ఆలయాలు పరిశీలిస్తున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు.

ఆలయాలు పరిశీలించిన టీటీడీ ఈవో, ఉప ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికె నారాయణ స్వామి తో కలిసి మంగళవారం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఆలత్తూరు, కలికిరి కొండ, కార్వేటినగరం ఆలయాలను సందర్శించారు. ఆలయాల్లో స్వామి వార్ల దర్శనం అనంతరం టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఉప ముఖ్యమంత్రి మనవి చేశారు
ఈ సందర్భంగా కార్వేటినగరం పుష్కరిణి వద్ద జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామి తన నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాల్లో పలు అభివృద్ధి పనులు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇందుకోసం తనను ఆలయాలను పరిశీలించాలని కోరారని, కోవిడ్ వల్ల పర్యటన ఆలస్యమైందని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు.

ఇక్కడ తిరుమల అనుభూతి కలుగుతుంది
ఆలత్తూరు లోని శ్రీ వరద
వేంకటేశ్వర స్వామి ఆలయం, కార్వేటినగరం వేణుగోపాల స్వామి ఆలయం , కలికిరి కొండ శ్రీవారి ఆలయాలను పరిశీలించామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. కలికిరి కొండ వెళ్లే భక్తులకు తిరుమలకు వెళ్లిన అనుభూతి కలుగుతుందని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు.

ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రం చేస్తాము
ఈ కేంద్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక పరంగా అభివృద్ధి చేయొచ్చని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలోని టీటీడీ ఆలయాలకు సంబంధించిన అభివృద్ధి పనులను శ్రీ వాణి ట్రస్ట్ సమావేశంలో చర్చించి మంజూరు చేస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు. ఎస్వీబీసి ద్వారా టీటీడీ ప్రతిరోజు ప్రసారం చేస్తున్న భగవద్గీత, గరుడ పురాణం లాంటి అనేక కార్యక్రమాలను ప్రజలు వీక్షించి ఆధ్యాత్మికత అలవాటు చేసుకోవాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి కోరారు.

సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో హిందూ ఆలయాలను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు. కార్వేటినగరంలో శ్రీ వేణు గోపాల స్వామి కోనేరు మధ్యలో నిర్మిస్తున్న నీరాలి మండపాన్ని మరింత వెడల్పు చేయాలని కోరారు. టీటీడీ కళ్యాణ మండపం లో వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కోరారు.

పురాతన ఆలయాలు
ఈ సందర్బంగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెంట టీటీడీ చీఫ్ ఇంజనీర్
నాగేశ్వరరావు తో పాటు ఎస్ ఇ సత్యనారాయణ, ఇఇ శివరామకృష్ణ, మనోహర్ పలువురు అధికారులు ఉన్నారు. ఈ సందర్బంగా స్థానిక ఆలయాల పనులు త్వరంగా పూర్తి చెయ్యాలని స్థానిక ప్రజలు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి మనవి చేశారు. ఉప ముఖ్యమంత్రి నియోజక వర్గంలో పలు హిందూ దేవాలయాలను అభివృద్ది పనులు త్వరగా పూర్తి చెయ్యాలని టీటీడీ అధికారులకు మనవి చేశారు. అతి పురాతనమైన, ప్రసిద్ది చెందిన ఆలయాలు ఈ నియోజక వర్గంలో ఉన్నాయని స్థానిక ప్రజలు అంటున్నారు.
Recommended Video

డాక్టర్ పోస్టులకు హిందువులకు మాత్రమే ఆహ్వానం
టీటీడీ చెందిన ఎస్వీ పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ కార్డియాక్ స్పెషలిస్టు డాక్టర్ల పోస్టులకు హిందూ మతానికి చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
పోస్టుల వివరాలు, దరఖాస్తు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబరు 25వ తేదీలోపు చీఫ్ మెడికల్ ఆఫీసర్, టీటీడీ, కేంద్రీయ వైద్యశాల, కెటి రోడ్, తిరుపతి, 517501, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు పంపగలరు. ఇతర వివరాలకు కార్యాలయ వేళల్లో 0877-2264371, 2264681 నంబర్లలో సంప్రదించగలరని టీటీడీ ప్రజాసంబంధాల అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications