TTD: శ్రీవారి సేవకులుగా దరఖాస్తులకు ఆహ్వానం - అర్హతలు, శిక్షణ, బాధ్యతలు..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవకుల పరిధిని పెంచాలని డిసైడ్ అయింది. శ్రీవారి సేవ కోసం వస్తున్న వారి సేవలను తిరుమల పరిధిలోని ఆస్పత్రుల్లోనూ విస్తరించనున్నట్లు ప్రకటించారు. సేవ చేయాలనుకునే వారికి శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో మూడు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నారై భక్తులు శ్రీవారి సేవకులుగా పని చేస్తామని వస్తున్నారని.. వారి సేవలను వినియోగించుకుంటామని ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

టీటీడీ ఆధ్వర్యంలోని ఆస్పత్రుల్లో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఆస్పత్రుల్లో సేవ చేయాలనుకునే వారికి శ్రీవారి సేవ ట్రైనర్ పేరుతో మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ సేవ చేయటానికి వచ్చే భక్తులకు కనీసం డిగ్రీ అర్హతగా ఉంటుందని చెప్పారు. సేవలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లోనూ వారి సేవలను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటికే సూపర్ వైజర్స్ శ్రీవారి సేవకుల విధులను పర్యవేక్షిస్తు న్నారని... పెద్ద సంఖ్యలో కొత్త వారు సైతం ముందుకు వస్తున్నారని వివరించారు. శ్రీవారి సేవకులట్రైనర్స్‌కు ఐఐఎం అహ్మదాబాద్, Director, Planning, Govt. of A.P వారి ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింద‌న్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా శ్రీవారి వైభవం, తిరుమల ప్రాముఖ్యత, భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలు, సేవాతత్వం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

ttd-to-launch-training-for-new-srivari-sevaks-to-utilise-services-in-temple-and-hospitals

గ్రూప్ సూపర్ వైజర్స్ విభాగంలో 45 - 65 సంవత్సరాల వయసు ఉన్న శ్రీవారి సేవలు తమ పేర్లను నమోదు చేసుకోవాలి. తిరుమలలోని వివిధ విభాగాలలో సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులు మరింత క్రమశిక్షణ, నిబద్ధతతో సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవా కాల పరిమితి 15 రోజులు, 30 రోజులు, 90 రోజులుగా నిర్ణయించారు. తిరుమలలో ఆలయంతో పాటుగా భక్తుల కోసం వీరి సేవలను వినియోగిస్తామని ఈవో శ్యామల రావు చెప్పారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు శిక్షణ తీసుకున్న వారి సేవలను వినియోగిస్తామని వివరించారు. సూపర్ వైజర్స్ కు మరింతగా శిక్షణ ఇచ్చి శ్రీవారి సేవకుల బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఎన్నారైలు శ్రీవారి సేవలకులుగా పని చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని..వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. అదే విధంగా తిరుమలలో బిగ్ క్యాంటీన్లు.. జనతా క్యాంటీన్లను టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. భక్తులకు మరింత రుచికరమైన ఆహారం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గతంలో క్యాంటీన్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని.. ఇప్పుడు వీటి ద్వారా మరింత మెరుగ్గా నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+