TTD: వేసవి సెలవుల్లో వారి సిఫారసు లేఖలు రద్దు, దర్శనంలో మార్పులు..!!

Tirumala: టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవిలో పెరిగే భక్తుల రద్దీకి అనుగుణంగా కొన్ని నిర్ణయాల అమలుకు సిద్దమైంది. బ్రేక్ దర్శనాల విషయంలో మార్పులు చేయనుంది. ఇక, భక్తులకు ఏఐ సాంకేతికతతో దర్శనం .. వసతి అమలుకు వీలుగా గుగూల్ తో ఒప్పందానికి కస రత్తు జరుగుతోంది. ఇక, ఈ వేసవి రద్దీ వేళ బ్రేక్ దర్శనాల్లో ఐఏఎస్, ఐపీఎస్ ల సిఫారసు లేఖలను రద్దు చేయాలని భావిస్తోంది. బ్రేక్ దర్శనాల వేళల మార్పు పైలెట్ ప్రాజెక్టు కింద అమలు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కీలక నిర్ణయాలు
టీటీడీ కొత్త నిర్ణయాల అమలుకు కసరత్తు చేస్తోంది. తిరుమలలో బ్రేక్ దర్శనాల కోసం ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను ఆమోదిస్తుండటంతో బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం పడుతోంది. దీంతో, సామాన్య భక్తులకు ఇబ్బందులు ఎదురవుతా యని గుర్తించారు. దీంతో, బ్రేక్ దర్శనాల వేళల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వచ్చే వారం నుంచి శని, ఆది వారాల్లో రద్దీ ఎక్కువగా ఉండే రోజులు కావటంతో గతంలో నిర్వహించిన విధంగా ఉదయం ఆరు గంటల నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ttd-to-new-timings-for-break-darshan-from-next-week-as-board-decision

బ్రేక్ కోసం సిఫార్సులు
కొద్ది రోజుల క్రితం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో వచ్చిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం అమలుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం తిరుమలలో ఏపీ నుంచి ఏపీ ప్రజాప్రతినిధుల ద్వారానే 1,800 నుంచి 2 వేల వరకు బ్రేక్‌ దర్శనాలకు టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఐఏఎస్‌, టీటీడీ ఉద్యోగులు, కేంద్ర మంత్రులు, సీఎంవోలు.. ఇలా మరో వెయ్యి నుంచి 1,500, టీటీడీ బోర్డు చైర్మన్‌, సభ్యులకు 580, స్వయంగా వచ్చే వీఐపీలు, టీటీడీ అధికారులు, దాతలకు కలిపి మరో 600 టికెట్లు, శ్రీవాణిట్రస్టుకు విరాళాలిచ్చే భక్తులకు 1,500 బ్రేక్‌ టికెట్లు ఇస్తున్నారు. ఇలా వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రోజుకు దాదాపు 7 వేల నుంచి 7,500 వరకు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం వీరందరికీ దర్శనం చేయించడానికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమయం తీసుకుంటు న్నట్లు చెబుతున్నారు.

Take a Poll

బ్రేక్ దర్శనాల్లో మార్పు
దీంతో, బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అదే సమయంలో వేసవి రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో.. కొందరి సిఫారసు లేఖలను రద్దీ కాలం పూర్తయ్యే వరకూ రద్దు చేయాలని భావిస్తోంది. దీంతో.. ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, స్థానిక అధికారు లు, ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని రద్దు చేయనున్నారని తెలుస్తోంది. కేవలం స్వయంగా వచ్చే అధికారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ అంశం పైన టీటీడీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకే సారి రద్దు చేయ కుండా ముందస్తు సమాచారంతో నిర్ణయం అమలు చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా ఆస్థానం.. 7న పట్టాభిషేకం నిర్వహణకు నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+