తిరుమలలో ఈ వేడుక చూసి తీరాల్సిందే - ప్రత్యేక ఏర్పాట్లు : సేవలు రద్దు..!!
తిరుమలలో జరిగే వరస పర్వదినాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
Tirumala: తిరుమలలో తెలుగు నూతన సంవత్సరంలో వరుస పర్వదినాలు నిర్వహించనున్నారు. ఉగాది ఆస్థానం.. శ్రీరామ పట్టాభిషేకం ఆ తరువాత సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు తది దశకు చేరుకున్నాయి. శ్రీరామనవమి ఉత్సవాలు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు. అదే సమయంలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏప్రిల్5 న ముఖ్యమంత్రి జగన్ ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. ఈ నెల 30,31 తేదీల్లో టీటీడీ ఘనంగా ఆస్థానాలు నిర్వహించనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉగాది..శ్రీరామ నవమి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 22న ఉగాది..ఈ నెల 30న తిరుమలలో శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించనున్నారు. 31న రాత్రి శ్రీరామ పట్టాభిషేకే మహోత్సవం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది. ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతీ ఏటా భక్తులు తరలి వస్తారు. ఈ ఏడాది కూడా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. మార్చి 30న ఉదయం 9 నుండి 11 గంటల వరకు రంగనాయకుల మండపంలో శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.

అదే రోజు సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు హనుమంత వాహనసేవ జరుగుతుంది. ఆ తరువాత రాత్రి 9 నుండి 10 గంటల నడుమ బంగారువాకిలి ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాల వేళ సహస్ర దీపాలకంరణ సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ సంప్రదాయాల ప్రకారం వైభవంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక..ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు సాలికట్ల వసంతోవత్సాల నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది. ఈ రోజుల్లో తిరుమలలో స్నపన తిరుమంజనం వసంత మండపంలో నిర్వహిస్తారు. బంగారు రథంలో ఊరేగింపు ఉండనుంది. ఈ ఉత్సవాల వేళ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ, అష్టాదళ పాద పద్మాసన సేవను టీటీడీ రద్దు చేసింది.












Click it and Unblock the Notifications