TTD: కల్యాణోత్సవం, ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల - టైమింగ్స్ ఇలా..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగాకల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూన్ 22న విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవాణి ట్రస్టు నిధులపై చేస్తున్న విమర్శల విషయంలో సీరియస్ గా స్పందించాలని టీటీడీ నిర్ణయించింది.
సేవలు..అంగప్రదక్షిణం టోకెన్లు:భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ ప్రకారం దర్శనం..సేవా టికెట్లను టీటీడీ ముందుగానే విడుదల చేస్తోంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో వీటిని బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవ వర్చువల్ సేవల కోటాను, అదేవిధంగా వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబర్ నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అదే రోజున అంటే జూన్ 22న శ్రీవారి పవిత్రోత్సవాల సేవాటికెట్ల విడుదల చేయనున్నారు.

పవిత్రోవ్సవాల టికెట్లు విడుదల:తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇక భక్తుల రద్దీ కొనసాగుతున్న సమయంలో టీటీడీ పలు నిర్ణయాలను అమలు చేస్తోంది.
ఈ నెలఖరు వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. జూలై 15వ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖల పైన దర్శనాలకు పరిమితి కొనసాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది. వెండివాకిలి నుంచి సింగిల్ లైన్ విధానం ప్రయోగం ఫలించింది. పెద్ద సంఖ్యలో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం వేగంగా అందే అవకాశం ఉంటుందని టీటీడీ చెబుతోంది. తాజాగా జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలోనూ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

ఆరోపణలు చేస్తే ఉపేక్షించం:తిరుమల శ్రీవాణి ట్రస్టు నిధుల పైన రాజకీయంగా ఆరోపణలు చేయటాన్ని పాలక వర్గం సీరియస్ గా తీసుకుంది. శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఈ అంశంపై రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తీర్మానించింది.
వాణి టికెట్ తీసుకునే భక్తులకు ట్రస్టుకు విరాళం కింద రూ.10 వేలకు, దర్శనం టికెట్ కోసం రూ.500కు రెండు రసీదులు ఇస్తున్నామని వెల్లడించింది. ఆన్‌లైన్‌లో ఈ టికెట్ బుక్ చేసుకున్నా రెండు రసీదులు వస్తాయని టీటీడీ స్పష్టం చేస్తోంది. టీటీడీలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications