TTD: టీటీడీ బోర్డు అత్యవసర భేటీ - భక్తులకు బిగ్ అలర్ట్..!!
Tirumala: టీటీడీ పాలక మండలి బోర్డు ఈ నెల 31న అత్యవసరంగా సమావేశం కానుంది. వచ్చే నెల 3న తిరుమలలో నిర్వహించనున్న రథసప్తమి వేడుకల వేళ ఏర్పాట్ల పైన సమావేశం కావాల ని నిర్ణయించారు. తిరుపతి తొక్కిసలాట ఘటన తరువాత రథసప్తమి వేళ భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే ఏర్పాట్ల పైన సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, రథసప్తమి వేళ ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న టీటీడీ.. భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు...బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
బోర్డు సమావేశంలో
టీటీడీ పాలకమండలి సభ్యులకు ఈ నెల 31న జరిగే అత్యవసర సమావేశానికి హాజరు కావాలని సమాచారం అందింది. రథసప్తమి వేడుకల నిర్వహణ పైన సమీక్ష చేయనున్నారు. శ్రీవారి ఉత్స వాల్లో రథసప్తమి అత్యంత ముఖ్యమైనది. ఈ వేడుకకు దాదాపు లక్ష మంది భక్తులు వచ్చే అవకా శం ఉందని అంచనా వేస్తున్నారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. ఫిబ్రవరి 4న ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనసేవతో శ్రీమలయప్ప స్వామివారి వాహన సేవలు ముగుస్తాయి.

బ్రేక్ దర్శనాలు రద్దు
రథసప్తమి సందర్భంగా ప్రివిలేజ్ దర్శనాలు, పలు సేవలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసు కుంది. అష్టాదళ పాదపద్మారాధన, ఊంజల్ సేవ, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేసారు. ఎన్‌ఆర్‌ఐలు, సీనియర్ సిటిజన్లు, చంటి బిడ్డల తల్లిదం డ్రులు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో వచ్చే నెల 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయటం లేదని ప్రకటించారు. ఇక, ప్రోటో కాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి వచ్చే నెల 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి వాహన సేవ
ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 దర్శనం) టోకెన్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా ఉండేం దుకు నిర్ణీత టైంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని టీటీడీ స్పష్టం చేసింది. రథ సప్తమి నాడు శ్రీవారికి వాహన సేవ నిర్వహించనున్నారు. ఉదయం 5.30 గంటకలు
సూర్యప్రభ వాహన సేవ, 9 గంటలకు చిన్నశేష వాహన సేవ, 11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. మధ్నాహ్నం 1 గంటకు హనుమంత వాహన సేవ,2గంటలకు చక్రస్నానం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహన సేవ, 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని టీటీడీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications