డైరెక్టర్‌తో సహజీవనం: టీవీ నటి దీప్తిది ఆత్మహత్యనా? (పిక్చర్స్)

హైదరాబాద్: టీవీ, సినిమా నటి దీప్తి అలియాస్ రామలక్ష్మి శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫతేనగర్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. ఆమె ఉంటున్న డ్రీమ్స్ స్టూడియోలో విగతజీవిగా కనిపించారు.

సనత్ నగర్ ఇన్స్‌పెక్టర్ హరిశ్చంద్రా రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన దీప్తి (31)కి విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయుడైన పెయింటర్ శంకర్‌తో వివాహమైంది. ఓ కుమార్తె ఉంది. సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాదు వచ్చిన దీప్తి.. ఆహ్వానం, ఆడదే ఆధారం తదితర సీరియళ్లలో నటించింది.

పెళ్లామా ప్రియురాలా, కొత్తొక వింత తదితర చిత్రాల్లో నటించారు. ఓ సీరియల్‌కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. భర్తతో విభేదాల కారణంగా దీప్తి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. ఫతేనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని డ్రీమ్స్ స్టూడియో ఏర్పాటు చేసి నటన, వ్యాఖ్యానం, నృత్యంలో శిక్షణ ఇస్తోంది.

బుల్లితెర దర్శకుడైన రమేష్‌తో సహజీవనం చేస్తోంది. శుక్రవారం దీప్తి, రమేష్‌లు బయటకు వెళ్లి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చారు. ఆ తర్వాత తాను బయటకు వెళ్లి 11 గంటలకు వచ్చానని, దీప్తి తలుపుతీయక పోవడంతో బాల్కనీలోని వెనుక వైపున ఉన్న పడక గది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో వేలాడుతూ కనిపించిందని రమేష్ చెప్పాడు. ఆత్మహత్య, హత్య కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

 దీప్తి

దీప్తి

బుల్లితెరకు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకుంది. పలు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్న దీప్తి అలియాస్ రామలక్ష్మి శనివారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

దీప్తి

దీప్తి

హైదరాబాద్, బాలానగర్ సమీపంలోని ఫతేనగర్‌లోని ఒక అపార్టుమెంట్‌లో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

దీప్తి

దీప్తి

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమె మరణానికిగల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసుకు దర్యాప్తు ప్రారంభించారు.

 దీప్తి

దీప్తి

ప్రేమికుల రోజున ఆమె ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+