ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు, సీబీఐకి అప్పగించాలని హైకోర్టు
విజయవాడ: ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. కేసు రికార్డులన్నీ ధ్వంసమయ్యాయని హైకోర్టుకు సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) తెలిపింది. కేసు నడుస్తున్న సమయంలోనే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ తెలిపింది.
రికార్డుల విధ్వంసం పైన హైకోర్టు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని రిజిస్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు పైన రాష్ట్ర పోలీసుల కన్నా సీబీఐ దర్యాఫ్తే మేలని హైకోర్టు అభిప్రాయపడింది. సీబీఐను సుమోటోగా ప్రతివాదిగా హైకోర్టు చేర్చింది.

కాగా, ఆయేషా మీరా హత్య కేసులో ఏళ్లుగా విచారణ సాగుతోంది. ఈ కేసులో అసలు దోషిని పట్టుకునేందుకు కేసును పునర్విచారణ చేయాలని హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తెలిపింది. దానిని ఆయేషా మీరా తల్లిదండ్రులు స్వాగతించారు.












Click it and Unblock the Notifications