తెలుగు మహిళకు ట్విట్టర్ సారథ్య బాధ్యతలు?

విజయవాడ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సారథ్యానికి తెలుగు మహిళ పద్మశ్రీ వారియర్‌కు ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా సిఇఓ పదవికోసం ట్విట్టర్ అనేకమంది పేర్లను పరిశీలించింది. అంతిమంగా పద్మశ్రీతోపాటు సిబిఎస్ ఇంటరాక్టివ్ విభాగం అధినేత జిమ్ లాన్ జోన్ పేర్లను ఎంపిక చేసింది.

వీరిద్దరిలో ఎవరికి సిఇఓ పదవి లభిస్తుందనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండగానే, కన్జూమర్ ఇంటర్నెట్ వ్యాపారంలో ఆరితేరిన పద్మశ్రీ వారియర్ వైపే ట్విట్టర్ మొగ్గు చూపినట్టు తెలిసింది. ఈ ఏడాది మొదట్లో డిక్ కాస్టోలో రాజీనామా చేసినప్పటినుంచీ ట్విట్టర్ అనేకరకాలుగా సరైన వ్యక్తి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Twitter has talked to Cisco's Padmasree Warrior about being its next CEO

పద్మశ్రీ స్వస్థలం విజయవాడ. మాంటిస్సోరి స్కూల్‌లో 10వ తరగతి వరకు చదివిన పద్మశ్రీ స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. వీరి సోదరుడు ఏల్లేపద్ది రామకృష్ణ చెన్నైలో వ్యాపారాలు సాగిస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఆమె అమెరికాలో స్ధిరపడి పలు కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించారు.

గతంలో ఆమె సిస్కో కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ట్విట్టర్ ఆఫర్‌పై పద్మశ్రీ ఇంకా ఏ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+