ఆ సంగతి నేనే మరిచిపోయాను.. గుర్తుంచుకున్నందుకు నాగబాబుకు థ్యాంక్స్ : అంబటి రాంబాబు

బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ్ముడి తరుపున ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు నటుడు నాగబాబు. ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. నాగబాబు ట్వీట్లపై వైసీపీ నేతలు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. మిగతావాళ్ల సంగతి పక్కనపెడితే.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు,నాగబాబు మధ్య ట్విట్టర్ వార్ హాట్ టాపిక్‌గా మారింది.

 నాగబాబు ఏమన్నారు.. :

నాగబాబు ఏమన్నారు.. :

బీజేపీతో జనసేన పొత్తు తర్వాత వైసీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడటంతో నాగబాబు ట్విట్టర్‌లో స్పందించారు. వైసీపీ మరియు అంబటి రాంబాబు గారి దు:ఖాన్ని చూడలేకపోతున్నానని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో మీ ఏకపాత్రాభినయం బహు ప్రశంసనీయం అంటూ మరో ట్వీట్‌ కూడా చేశారు. ఇక 'తోక లేని పిట్ట' సినిమాలో అంబటి నటించిన ఓ సన్నివేశానికి సంబంధించిన చిత్రాన్ని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంబటి ఏకపాత్రాభినయం అంటూ తాను చెప్పింది జోక్ కాదని, అంబటి నిజంగానే మంచి నటుడని పేర్కొంటూ ఆ చిత్రాన్ని పోస్ట్ చేశారు. తోకలేని పిట్ట సినిమాలో అంబటి పలికించిన గొప్ప హావభావాలు అంటూ ఎద్దేవా చేశారు.

 ఆ సంగతి నేనే మరిచిపోయాను..: అంబటి

ఆ సంగతి నేనే మరిచిపోయాను..: అంబటి

నాగాబాబు ట్వీట్లపై అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తాను తోకలేని పిట్ట సినిమాలో నటించిన సంగతిని తానే మరిచిపోయానని, గుర్తుంచుకున్నందుకు నాగబాబుకు ధన్యవాదాలని చెప్పారు. 'నేను నటనలో ఓటమిపాలై నిష్క్రమించానని.. మరి రాజకీయాల్లో ఓటమిపాలైన మీరు నిష్క్రమిస్తారా.. లేక..' అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు,మీరు మీ అన్నాదమ్ములు సినిమాల్లో నటించి వినోదం పంచగలరు తప్ప రాజకీయాల్లో నెగ్గుకురాలేరబ్బా.. అంటూ కామెంట్ చేశారు.

 రాజకీయాలు మీవల్ల కాదన్న అంబటి.. :

రాజకీయాలు మీవల్ల కాదన్న అంబటి.. :

ఏకపాత్రాభినయం అంటూ అంబటి రాంబాబు ఫోటోను నాగబాబు ట్వీట్ చేయగా.. బహు పాత్రలలో బాగు బాగు అంటూ పవన్ కల్యాణ్ పొత్తుల ఫోటోలను అంబటి ట్వీట్ చేశారు. గతంలో బీజేపీ,టీడీపీ,వామపక్షాలు,బీఎస్పీలతో పవన్ పొత్తుల ఫోటోలను పోస్ట్ చేశారు. 'చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి.. దాన్ని మోయలేక కాంగ్రెస్‌లో విలీనం చేశారు..మంచిగా నటిస్తున్నారు.. మీ తమ్ముడు గారు జనసేన పెట్టి మోయలేక బీజేపీలో ముంచబోతున్నారు. మంచిగా సినిమాల్లో నటించబోతున్నారు..' అని అంతకుముందు మరో ట్వీట్‌లో అంబటి ఎద్దేవా చేశారు.

 అంబటిపై నాగబాబు విమర్శలు.. :

అంబటిపై నాగబాబు విమర్శలు.. :

అదిరింది షో ద్వారా తనకు జబర్దస్త్ లోటు తీరిందని.. అంబటి,పేర్ని,అనిల్,అవంతి మొదలైన నాయకులతో ఎక్స్‌ట్రా జబర్దస్త్ లోటు కూడా తీరిందని, ఇక అదిరింది కామెడీ షో పార్ట్-2 కూడా అవసరం లేదేమో అనిపిస్తుందని నాగబాబు ఓ ట్వీట్‌లో వైసీపీ నేతలను ఎద్దేవా చేశారు. మొత్తంగా నాగబాబు,అంబటి రాంబాబుల మధ్య ట్విట్టర్‌లో ట్వీట్ల యుద్దం నడుస్తుందని చెప్పాలి. బీజేపీ-జనసేన పొత్తుతో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని నాగబాబు చెబుతుంటే.. స్థిరత్వం లేని పవన్ కల్యాణ్‌తో బీజేపీ పొత్తు.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమేనని అంబటి విమర్శిస్తున్నారు.

4)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+