Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీ సుబ్బరామిరెడ్డి సతీమణికి లోన్ ఇప్పిస్తామని చెప్పి రూ. 105 కోట్లు కాజేశారు: నిందితుల అరెస్ట్

హైదరాబాద్: కొందరు మోసగాళ్లు ప్రముఖులనే లక్ష్యంగా చేసుకుని కోట్లలో దోచేస్తున్నారు. మాయమాటలతో చెప్పి తమ బుట్టలో వేసుకుంటున్నారు. తాజాగా, ఇలాగే ఓ ప్రముఖ వ్యక్తి సతీమణి కూడా మోసపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను పట్టుకున్నారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి లోన్ ఇప్పిస్తామంటూ మాజీ ఎంపీ టీ సుబ్బరామిరెడ్డికి చెందిన నిర్మాణ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌ను మోసం కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

నిందితులు హర్షవర్ధన్, బాలూభాయ్ పటేల్ తమకు అప్పు ఇప్పిస్తామని చెప్పారని, ఇందుకు షేర్లను తనఖా ఉంచుకుని వాటిని అమ్మి రూ. 105 కోట్లు కాజేశారని సుబ్బరామిరెడ్డి సతీమణి ఇందిరా రెడ్డి గత జులై నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రొసెసింగ్ రుసుం పేరుతో షేర్ల పత్రాలు తీసుకున్నారని తెలిపారు. నిందితులు ముంబైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని నాలుగు రోజులక్రితం అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి జైల్లో పెట్టారు.

Two arrested for duping former Union minister T Subbarami Reddy’s wife of 32.5L shares

కాగా, సోమాజీగూడలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ రుణం కోసం యత్నాలు చేస్తుండగా.. గత జూన్ నెలలో ఛాంపియన్ ఫిన్‌సెక్ కంపెనీ(సీఎఫ్ఎల్) ప్రతినిధులైన హర్షవర్ధన్, బాలూభాయ్ పటేల్ లు ఇందిరా రెడ్డిని సంప్రదించారు. బ్యాంకింగేతర సంస్థల నుంచి రూ. 11.50 కోట్ల రుణం ఇప్పిస్తామని నమ్మించారు. అంతేగాక, రుణం మంజూరయ్యాక తమకు ఒక శాతం కమీషన్ ఇవ్వాలన్నారు.

పూచీకత్తుగా నిర్మాణ సంస్థ షేర్లు తనఖా ఉంచాలని సూచించడంతో ఇందిరా రెడ్డి అంగీకరించారు. 32.50 లక్షల షేర్లను సీఎఫ్ఎల్ పేరుపై బదిలీ చేశారు. లోన్ అందకపోవడంతో హైదరాబాద్‌లోని సీఎఫ్ఎల్ కార్యాలయానికి వెళ్లగా.. హర్షవర్ధన్, బాలుభాయ్‌లు ఇద్దరూ లేరు. గాయత్రి ప్రాజెక్ట్ ప్రతినిధులకు అనుమానం వచ్చి సరిచూసుకున్నారు.

అయితే, జులై 8న షేర్ మార్కెట్లో 32.50 లక్షల షేర్లను నిందితులు అమ్మేసినట్లు తేలింది. దీంతో ఆ రోజున షేర్ల విలువ రూ. 105 కోట్లని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబైలో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానేకు చెందిన బాలూబాయ్ పటేల్ కొన్నేళ్ల క్రితం ఛాంపియన్ ఫిన్ సెక్‌పేరుతో సంస్థను స్థాపించాడని, హైదరాబాద్, ముంబైలో కార్యాలయాలున్నాయని పోలీసుల విచారణలో తేలింది. ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+