నందిగామలో ఆటో-లారీ ఢీ: ఇద్దరు అక్కడికక్కడే మృతి!
నందిగామ: కృష్ణా జిల్లా నందిగామ శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అన్నాసాగరం బైపాస్ రోడ్డు వద్ద రాంగ్‌రూట్‌లో వస్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.
ప్రమాదంలో మరణించినవారిని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. చందర్లపాడు మండలం కోపూరులో జరుగుతున్న బంధువుల దశదిన కర్మ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను నందిగామ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.













Click it and Unblock the Notifications