నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేప్ కేసులో నిందితుడ్ని వదిలేసిన డిఎస్పీ సస్పెన్షన్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు డిఎస్పీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మాజీ డిఎస్పీ శ్రీనివాస రావు, అనంతపురం పిటిసి డిఎస్పీ హనుమంతులు సస్పెన్షన్‌కు గురయ్యారు. డిఎస్పీ శ్రీనివాస రావు అసాంఘిక శక్తులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో అమ్మాయిపై అత్యాచారం జరిగిన కేసులో నిందితుడిని అతను వదిలేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీనివాస రావును సస్పెండ్ చేశారు.

కాగా, అనంతపురం పిటిసి హనుమంతును కూడా సస్పెండ్ చేసారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని కూడా ఆయనపై ఆరోపణలు వచ్చాయి. డిజిపి వారిద్దరిని సస్పెడ్ చేస్తూ డిజిపి కార్యాలయం మంగళవారంనాడు ఉత్తర్వులు వెలువడ్డాయి.

Two DSPs suspended in Andhra Pradesh

ముగ్గురికి జైలు శిక్ష

ఇదిలావుంటే, నగల కోసం స్నేహితుడిని మతమార్చిన కేసులో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది. నెల్లూరు జిల్లాలోని నలుకూరులో 2009లో జరిగిన ఘటనలో నెల్లూరు లక్ష్మయ్య, స్నేహితుల చేతిలో హతమయ్యాడు. కోవూరు సునీల్‌, ఎస్కే కాచెం, శోభన్‌బాబు అనే ముగ్గురు నెల్లూరు లక్ష్మయ్యకి స్నేహితులు. లక్ష్మయ్య వద్ద ఉన్న నగలపై కన్నేసిన స్నేహితులు అతడి గొంతు నులిమి చంపేసి, చెరువులో పడేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు ముగ్గురు నిందితులని అరెస్టు చేశారు.

అయితే కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ కేసులో నిందితులైన సునీల్‌, కాచెం, శోభన్‌బాబులకు నెల్లూరు నాలుగో అదనపు కోర్టు జీవితఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. మూడువేలు జరిమానా విధిస్తూ జస్టిస్‌ సీహెచ్‌ రామచంద్రమూర్తి తుదితీర్పు వెలువరించారు.

English summary
Andhra Pradesh DGP has suspended Avanigadda ex DSP Srinivas Rao and Ananthapur DSP Hanumanth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X