అమ్మాయిలపై అత్యాచారం: పాతకక్షలతో వ్యక్తి హత్య

అక్కడి నుంచి తప్పించుకున్న బాలికలు ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో వారు నిందితులను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి మండలం రావులపురంలో పాతకక్షలు మంట పెట్టాయి. గ్రామానికి చెందిన చిన్నగంగయ్య అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. గత రాత్రి ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు సాంఘిక నాటాకాన్ని వేశారు. టిడిపి మద్దతుదారుడు చినగంగయ్య ఈ నాటకాన్ని చేసేందుకు వచ్చి ఈలలు,కేకలు వేశారు. అతడిని వారించినా వినకపోవడంతో మూకుమ్మడిగా దాడిచేయడంతో తీవ్రంగాయపడిన గంగయ్య మృతి చెందాడు.
ఎన్నికల కక్షలను మనసులో పెట్టుకుని తమ సోదరుడిపై దాడి చేసి హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారం రోజుల్లో ముగ్గురు హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపుతోంది.












Click it and Unblock the Notifications