కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్ గొడవ: పులివెందులలో భారీ ఘర్షణ, దాడులు

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: బైకు వివాదం భారీ ఘర్షణకు దారి తీసింది. పరస్పరం సవాల్‌ చేసుకున్న ఇద్దరు కురాళ్ల సమస్య రెండు వర్గాల మధ్య దాడిగా మారింది. రాళ్లు, కర్రలు, సీసాలతో ఇరు వర్గాల మధ్యా దాదాపు గంటపాటు హోరాహోరీ ఘర్షణ చోటు చేసుకుంది. కడప జిల్లాలోని పులివెందుల పట్టణంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది.

పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. పులివెందులలోని నగరిగుట్టకు చెందిన నిఖిల్‌ అనే విద్యార్థి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైకుపై వెళ్తుండగా అదే సమయంలో చింతలజూటూరుకు చెందిన అంజి అనే వ్యక్తి తన బైకుపై అటువైపుగా వచ్చాడు. ఇద్దరి బైకు లూ ఢీకొనే పరిస్థితిలో అంజి సడన్‌ బ్రేకు వేసి కిందపడిపోయాడు.

Two groups clash at Pulivendula in Kadapa district

నిఖిల్‌ బైకు తగలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, తాను కిందపడిపోయినా కూడా కనీసం ఆపకుండానే వెళ్తున్నాడంటూ అంజి నిఖిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ మొదలైంది. దీంతో నిఖిల్‌ తండ్రికి ఫోన్‌ చేసి అక్కడికి పిలిపించుకున్నాడు. ఇరువురి మధ్య ఘర్షణ మొదలై ఒకరికొకరు సవాలు విసురుకున్నారు.

ఆ తర్వాత అంజి తన వర్గానికి చెందిన కొంతమందిని తీసుకుని నిఖిల్‌ ఇంటి వద్దకు వెళ్లారు. వారు దాడికి రావడంతో నిఖిల్‌ ఇంటి చుట్టు పక్కల వారంతా ఏకమై ఇరువర్గాలు రాళ్లు, కర్రలు, సీసాలతో పరస్పరం దాడులకు దిగారు. గం టసేపు వీరు దాడులు-ప్రతిదాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

English summary
Two groups clashed at Pulivendula in Kadapa district. Five injured in the clashes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X