ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు మృతి, అనంతలో ముగ్గురు

హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతున్న ఇద్దరు విద్యార్ధులు మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు మండలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో విద్యార్ధుల బైక్‌ను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో పాతకోట దళితవాడకు చెందిన అనిల్ కుమార్, అంజి అనే విద్యార్ధులు అక్కడికక్కడే చనిపోయారు. ఘటనాస్ధలికి చేరు9:40 AM 3/11/2015కున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Two intermediate students dead in accident at Chittoor

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పేటకుంట వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బోల్తాపడిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. రామేశ్వరం నుంచి కర్నూలు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది.

క్షతగాత్రులను పెనుకొండ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+