పిల్లలు పుట్టలేదని మరొకరితో వివాహేతర సంబంధం, భర్తను ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

కాకినాడ: పిల్లలు పుట్టకపోవడంతోపాటు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పాటుచేసుకొన్న వివాహిత ప్రియుడి సహయంతో భర్తను హత్య చేయించింది.అయితే ఈ ఘటనపై విచారణ చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ నుండి వీరంపాలెం వెళ్ళే దారిలో వీరబాబు అనే వ్యక్తి ఈ నెల 6వ, తేదిన హత్యకు గురయ్యాడు.

two members arrested for murder case in East Godavari

వీరబాబుకు అదే మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన వీరలక్ష్మికి 12 ఏళ్ళ క్రితం వివాహమైంది. ఇన్నేళైనా సంతానం కలగకపోవడంతో తన భర్తలోనే లోపముందని వీరలక్ష్మి అనుమానించింది.

తన ఇంటి నిర్మాణానికి తాపీ కూలీ వచ్చిన రంగంపేట మండలం ముకుందవరం గ్రామానికి చెందిన వాసంశెట్టి శ్రీనుతో వీరలక్ష్మీ వివాహేతర సంబంధం పెట్టుకొంది.

ఈ విషయం తెలుసుకొన్న వీరబాబు భార్య వీరలక్ష్మిని తీవ్రంగా మందలించాడు. అంతేకాదు శ్రీనుపై హత్యాయత్నం చేశాడు. అయితే శ్రీనివాస్ ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నాడు.

ఈ విషయాన్ని వీరలక్ష్మికి చెప్పాడు. అయితే వీరలక్ష్మి కూడ తనను తన భర్త చిత్రహింసలు పెడుతున్నాడని ప్రియుడు శ్రీనివాస్‌కు చెప్పింది. అంతేకాదు తన భర్తను చంపేయాలని ప్రియుడిని కోరింది.

దీంతో ఈ నెల 6వ, తేదిన తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వీరబాబు పొలానికి వెళ్ళే దారిలో మాటువేసిన శ్రీనివాస్ వీరబాబును కర్రతో కొట్టి చంపాడు.

ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులు వీరలక్ష్మికి శ్రీనివాస్‌తో ఉన్న వివాహేతర సంబంధం వెలుగుచూసింది. ఈ కోణంలో విచారించిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వీరబాబు హత్య విషయాన్ని ఒప్పుకొన్నాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wife murdered his husband with the help of lover in Rajanagaram mandal at East godavari district. police arrested wife and her lover on Saturday.
Please Wait while comments are loading...