హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐఫోన్ అని కొంటే బాక్సులో బండరాయి: ఇద్దరు యుపి వాసుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Two men arrested for betraying users
హైదరాబాద్: తక్కువ ధరకే ఐఫోన్, లాప్‌టాప్‌లు అమ్ముతామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో అదనపు డిసిపి నాగరాజ్ మీడియాకు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌కు చెందిన ఎండి అబ్బాస్ అలీ(31), ఎండి మెహందీ హుస్సేన్(35) వీరిద్దరూ నగరానికి వచ్చి గతంలో చీరాల వ్యాపారం చేశారు. ప్రస్తుతం ఒక స్కూటర్ కొనుక్కొని రద్దీ ప్రాంతాల్లో ఐఫోన్లు, లాప్‌టాప్‌లు చాలా తక్కువ ధరకే అమ్ముతున్నామని చెప్పి ఆసక్తి చూపినవారికి ఒరిజినల్‌వి చూపిస్తుంటారు.

తక్కువ ధర చూసి ఆశపడిన వినియోగదారులు నగదు చెల్లించాక అప్పటికే రాళ్లు పెట్టి నీట్‌గా సీల్ చేసి ప్యాక్ చేసిన కొత్త పాకెట్ వాళ్లకిచ్చి క్షణాల్లో అక్కడినుంచి ఉడాయిస్తారు. తెరిచి చూసిన వినియోగదారులు బండరాళ్లు చూసి బోరుమంటారు.

ఇలా పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పరిధిలో ముగ్గురిని మోసం చేశారు. ఎస్ఆర్‌నగర్ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి లక్షా మూడువేల నగదు, స్కూటర్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో పంజాగుట్ట ఏసిపి వెంకటేశ్వర్లు, ఎస్ఆర్‌నగర్ సిఐ శంకర్ పాల్గొన్నారు.

English summary
Two men arrested for betraying users in hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X