జరభద్రం: కర్నూలు అనంతపురంలో స్వైన్ ఫ్లూ రాకాసి..ఇద్దరు మృతి
అనంతపురం: మొన్న తిరుపతి నిన్న హైదరాబాద్ నేడు అనంతపూర్... స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లాలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మొత్తం 10 కేసులు నమోదు కాగా అందులో ఇద్దరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అనంతపురం కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా ఆరుగురు పేషెంట్లు స్వైన్ ఫ్లూ బారిన పడి మృతి చెందినట్లు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
సోమవారం ఓ గర్భిణి స్త్రీ మరియు ఓ వృద్ధురాలు స్వైన్ ఫ్లూ బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. స్వైన్ ఫ్లూ సోకిన వారికి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.ఇప్పటి వరకు 13 మందికి స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించాయని జిల్లా అదనపు ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ సరస్వతి దేవి తెలిపారు. ఇక స్వైన్ ఫ్లూ వ్యాధి పాకుతుండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు.

పొరుగు జిల్లాలు అయిన అనంతపురం, కర్నూలు కడప జిల్లాలోని మండల స్థాయిలో సిబ్బందిని అలర్ట్ చేశారు. స్వైన్ ఫ్లూ రాకుండా ఆయా గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. స్వైన్ ఫ్లూ విస్తరించకుండా గ్రామాల్లో నివసించే ప్రజలకు అవగాహన తీసుకురావాల్సిందిగా సిబ్బందికి సూచించారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపించిన వ్యక్తులలో కొందరిని జిల్లా ఏరియా ఆస్పత్రులకు తరలిస్తుండగా మరికొందరిని బెంగళూరు, బళ్లారిలోని హాస్పిటల్స్‌కు తరలిస్తున్నారు.
ఈ మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పిలుపునిచ్చారు. జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యులకు చూపించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications