ఆక్రమ సంబంధంతో విరక్తి: ఇద్దరు ఆత్మహత్య
కర్నూలు: వివాహేతర సంబంధం కారణంగా జీవి తంపై విరక్తి చెంది ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం కర్నూలు జిల్లా పగిడ్యాల మండలంలో జరిగింది. మృతుల బంధువులు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.
పగిడ్యాల గ్రామానికి చెందిన రాజు (28) ఆటో నడుపుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేవాడు. ఇతడికి మూడేళ్ల క్రితం నందికొట్కూరుకు చెందిన సువర్ణతో పెళైంది. ఆదే గ్రామానికి చెందిన శ్యామలమ్మ(22) భర్తకు దూరంగా ఉంటూ పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలో వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

నాలుగు రోజుల క్రితం రాజు రాజోలిలోని తన బంధువుల ఇంటికి శ్యామలమ్మతో కలిసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న శ్యామలమ్మ తల్లి రా ములమ్మ తన కూతురు కనిపించడం లేదని ముచ్చుమర్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజు బం ధువులను స్టేషన్‌కు పిలిపించి శ్యామలమ్మను తీసుకు రావాలని ఆదేశించినట్లు సమాచారం.
ఈ విషయం తెలిసి రాజు, శ్యామలమ్మ రాజోలిలో బుధవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గమనించిన బంధువులు వారిని ఆస్పత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందారు.












Click it and Unblock the Notifications