విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు
Ugadi 2024: వేసవి సెలవుల వల్ల ఇప్పటికే రైళ్లన్నీ రద్దీగా మారాయి. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఉగాది, రంజాన్ పండగలు దీనికి తోడయ్యాయి. వీకెండ్ హాలిడేలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఏర్పడింది. సీటు దొరకని పరిస్థితి నెలకొంది.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఉగాది పండగ కోసం విజయవాడ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి ప్రత్యేక రైలును నడిపించనున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో ఈ రెండు ఎక్స్‌ప్రెసె రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

నంబర్ 07001 ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10వ తేదీన అంటే బుధవారం నాడు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం హుబ్లీకి చేరుకుంటుంది. ఈ నెల 11వ తేదీన హుబ్లీ నుంచి బయలుదేరే మరో రైలు ఆ మరుసటి రోజు విజయవాడకు చేరుకుంటుంది.
గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల, డోన్, గుంతకల్లు, బళ్లారి, తొరణగల్లు, హొస్పేట జంక్షన్, మునీరాబాద్, కొప్పల్, గదగ్, అన్నెగిరి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.
ప్రస్తుతం విజయవాడ నుంచి హుబ్లీకి వెళ్లడానికి మూడు రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. శ్రీ సిద్ధారూఢ స్వామిజీ హుబ్లీ, వాస్కోడిగామా- అమరావతి, హుబ్లీ- అమరావతి ఎక్స్‌ప్రెస్‌లు ప్రస్తుతం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తోన్నాయి. తాజాగా ఉగాది పండగను దృష్టిలో పెట్టుకుని ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైలును నడిపించబోతోండటం వల్ల ప్రయాణికులకు ఊపిరి పీల్చుకున్నట్టవుతుంది.












Click it and Unblock the Notifications