15 రోజులు నిర్బంధించి కోడలిపై మేనమామ రేప్: నోట్లో కారం

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి అత్యంత నీచమైన కార్యానికి ఒడిగట్టాడు. 11 ఏళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలికను 15 రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడు. బయటకు చెబుతుందనే భయంతో ఆమెను చిత్రహింసలు పెట్టాడు. తిరుపతిలో డాక్టర్‌కు చూపిస్తానని తీసుకుని వెళ్లి నోట్లో కారం పెట్టి గదిలో బంధించి ఘోరానికి ఒడిగట్టాడు.

అతన్ని రాముగా గుర్తించారు. బాలికను తీసుకుని వెళ్లడంతో సోదరి అతనికి ఫోన్ చేస్తూ వచ్చింది. అయితే, అతని ఫోన్ 15 రోజుల పాటు స్విచ్చాఫ్ అయి ఉంది. చివరకు 15 రోజుల తర్వాత ఫోన్ ఆన్ చేశాడు. అమ్మాయిని వైద్యుడికి చూపించానని, తీసుకుని వస్తున్నానని చెప్పి ఊరికి తీసుకుని వెళ్లాడు.

బాలిక తీవ్రమైన అస్వస్థతతో ఉండడంతో ఆమెను కర్నూలు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒళ్లంతా గాయాలున్నాయని చెప్పారు. ఆ కిరాతకుడిని తన కళ్ల ముందు ఉరి తీయాలని బాలిక తమతో అన్నట్లు ఓ ప్రముక తెలుగు టీవీ చానెల్ ప్రతినిధి చెప్పాడు. 

ఇదిలావుంటే కర్నూలు జిల్లాని లొద్దిపల్లెకు చెందిన కురువ మల్లమ్మ (50) అనే మహిళ గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంత కాలంగా మల్లమ్మకు తలనొప్పి వస్తుండగా, శస్త్రచికిత్స చేయించినట్లు తెలిపారు. మతిస్థిమితం అంతంత మాత్రంగానే ఉండటంతో తలనొప్పి తాళలేక పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Uncle rapes a girl in Kurnool district of AP

కర్నూలు జిల్లాలోని గంజహళ్లి గ్రామంలో వ్యవసాయ బోరుబావి వద్ద విద్యుదాఘాతంతో ఈశ్వరమ్మ(30) అనే మహిళ గురువారం దుర్మరణం చెందారు. దేవనకొండ మండలం తెర్నెకల్‌ గ్రామానికి చెందిన ఈశ్వరమ్మకు గంజహళ్లికి చెందిన బడేసాహెబ్‌తో ఏడాది క్రితం వివాహం జరిగింది. బడేసాహెబ్‌కు ఈశ్వరమ్మ రెండో భార్య.

మధ్యాహ్నం ఉల్లి పంటకు నీరు పెట్టెందుకు ఈశ్వరమ్మ పొలానికి వెళ్లారు. నీరు పెడుతుండగా విద్యుత్తు మోటారు ఆగిపోయింది. విద్యుత్తు మోటారును పరిశీలింస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఆమె అక్కడిక్కడే మృతిచెందారు. విద్యుదాఘాతంతో మృతిచెందిన ఈశ్వరమ్మ కళ్లను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించినట్లు ఎస్‌ఐ దేవేంద్రకుమార్‌ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 11 year old girl has been raped by her uncle for 15 days in Kurnool district of Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X