కేసీఆర్ ప్రతిపాదనకు ఉండవల్లి రియాక్షన్ ఇదీ!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీకి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గట్టి షాకిచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ రాష్ట్ర సమితి ఏపీ ఇన్‌ఛార్జి పదవిని ఇవ్వజూపగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో సమావేశమై ఏపీకి రాగానే ఇన్‌ఛార్జి పదవి సిద్ధంగా ఉన్నట్లు తేలడంతో ఉండవల్లి కంగారుపడి మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటున్నారు.
రాజకీయాల నుంచి తాను పూర్తిగా విరమించానని ఆ సమావేశంలో ఉండవల్లి చెప్పారు. అంటే బీఆర్ఎస్ ఇన్‌ఛార్జి పదవిని తీసుకోవడానికి సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేసినట్లు అర్థమవుతోందని రాజకీయవేత్తలు భావిస్తున్నారు. పనిలో పనిగా ఉండవల్లి కేసీఆర్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. జాతీయస్థాయిలో నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి, ఆయనకు ధీటైన ప్రత్యర్థి కేసీఆర్ ఒక్కరేనని తేల్చిచెప్పారు. కేసీఆర్ చెప్పిన విషయాలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని, ఆయన సరైన ఆలోచనా విధానంతో, సరైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని అర్థమవుతోందన్నారు.

దేశంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ప్రమాదకరమైన ఆలోచనతో బీజేపీ ఉందని, అదిప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. అసలు బీజేపీ విధానాలే దేశానికి ప్రమాదకరంగా మారాయని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, ఆ సామర్ధ్యం కూడా కేసీఆర్‌కు ఉందన్నారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ లీడ్ చేయగలిగే సామర్థ్యం కేసీఆర్ దగ్గర ఉందన్నారు. ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలు బీజేపీవేనని, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీకే మద్దతిస్తారన్నారు. చివరగా జాతీయ రాజకీయాలపై, బీఆర్ఎస్‌పై కేసీఆర్ తో చర్చే జరగలేదంటూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications