మోడీ పెద్ద తప్పు చేశారు, ఏడాది తప్పదు: ఉండవల్లి మాట
హైదరాబాద్: స్వాతంత్ర్యం వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్లు రద్దు నిర్ణయంపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. నల్లధనం అరికట్టాలన్న మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని, అయితే పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీ తీరు సరిగాలేదని అన్నారు.
ప్రధాని మోడీ గతంలో ఎవరూ చేయని తప్పు చేసి, దేశంలో ఎకనామిక్ ఎమర్జెన్సీని సృష్టించారని విమర్శించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోడీ చేసిన ప్రకటనతో దేశంలోని కష్ట జీవులకు దెబ్బ తగిలిందని అరుణ్ కుమార్ తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది పడలేదని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఉండవల్లి పేర్కొన్నారు.
గతంలో రూ. 96వేల కోట్ల మేర విదేశాలకు తరలిపోతే.. ఈ ఏడాది రూ. 2లక్షల76వేల కోట్లు బయటకు పోయిందని తెలిపారు. మోడీ అనుభవ రాహిత్యమే దీనికి కారహని ఉండవల్లి ఆరోపించారు. దేశంలో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియడం లేదని అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఏడాది పాటు సామాన్యులపై ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications