• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వృద్ధాశ్రమంలో శవాల దందా స్టోరీలో ట్విస్ట్...ఆ సెల్వరాజ్ గుంటూరు సుబ్బారావే...

|

గుంటూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంచీపురం వృద్ధాశ్రమం శవాల దందా ఉదంతంలో అతి పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ శవాల దందాను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి...ఈ దారుణాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షి అయిన సెల్వరాజ్ అనే వృద్దుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి గానే అందరూ భావించారు. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఏమిటంటే ఈ వెటరన్ హీరో స్వస్థలం గుంటూరు అని, అతడి అసలు పేరు కూడా సుబ్బారావు అని తెలిసింది.

కాంచీపురం శవాల దందాకు సంబంధించిన వార్తలను పేపర్లో చూసిన గుంటూరుకు చెందిన ఓ కుటుంబం...ఆ ఆశ్రమం గుట్టును బైటపెట్టినట్లుగా చెబుతున్న వ్యక్తి ఫోటోను చూసి దిగ్భ్రాంతి చెందారు. కారణం వాళ్లు సెల్వరాజ్ గా చెబుతున్న ఆ వ్యక్తి పేరు సుబ్బారావు అని, అతడు మతిస్థిమితం లేక ఆరు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడని...ఆ తరువాత మళ్లీ ఈ రకంగా పేపర్ లో చూస్తున్నామని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో ఆ సెల్వరాజ్ ఊరఫ్ సుబ్బారావును తీసుకొచ్చేందుకు అతడి కుటుంబ సభ్యులు చెన్నై బయలుదేరి వెళ్లారు.

ఊహించని ట్విస్ట్...గుంటూరు వాసేనా!

ఊహించని ట్విస్ట్...గుంటూరు వాసేనా!

కాంచీపురం జిల్లా పాలేశ్వరం వృద్ధాశ్రమంలో వరుసగా అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నవృద్ధులు...వారు చనిపోయాక శరీరాలను కుళ్లబెట్టి అస్థిపంజరాలను విదేశాలకు అమ్ముకుంటున్న వైనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మినీ లారీలో ఒక మృతదేహం, మరో మహిళతో పాటు ఈ సెల్వరాజ్ అనే వ్యక్తిని వేరే వృద్దాశ్రమం నుంచి ఆ పాలేశ్వరం ఆశ్రమానికి తరలిస్తుండగా...అంతకు ముందే దీని గురించి విని ఉన్నఅతడు కేకలు వేసి జనాన్ని అప్రమప్తం చేసి స్థానికుల సాయంతో బైటపడిన ఉదంతం పెను ప్రకంపనలు రేపింది. అయితే ఆ సెల్వరాజ్ ఫోటోను పేపర్ లో చూసిన గుంటూరు పిచ్చుకలగుంటకు చెందిన ఓ కుటుంబం అతడిని తమ కుటుంబ సభ్యుడు రెడ్డి సుబ్బారావుగా గుర్తించారు. అతడు 6 నెలల క్రితం మతిస్థిమితం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోగా ఆ వెళ్లిపోయేటప్పుడు అతడి వంటి మీద ఉన్నలుంగీనే ఇప్పుడు కూడా ఉండటంతో అతడిని గుర్తుపట్టడం మరింత సులభమైందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 ఎవరీ సుబ్బారావు...ఇక్కడ ఏం చేసేవాడు...అక్కడ ఏం చేస్తున్నాడు...

ఎవరీ సుబ్బారావు...ఇక్కడ ఏం చేసేవాడు...అక్కడ ఏం చేస్తున్నాడు...

గుంటూరు నగరం నడిబొడ్డున ఉండే పిచ్చికులగుంటలో ఈ రెడ్డి సుబ్బారావు(70) ఊరఫ్ సెల్వరాజ్ కుటుంబం నివసిస్తోంది. ఈ సుబ్బారావుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రిక్షా తొక్కి కుటుంబాన్నిపోషించే సుబ్బారావుకు ఉన్నట్టుండి మతి స్థిమితం తప్పింది. దీంతో పనికి వెళ్లకుండా అప్పటి నుంచి చిన్నకూతురు దగ్గరే ఉంటున్నాడు. ఆ క్రమంలోనే 6 నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో అతడి కూతురు మహాలక్ష్మి అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్ కూడా ఇచ్చింది. ఆ తరువాత కుటుంబ సభ్యులు, బంధువులు వెతికినా సుబ్బారావు ఆచూకి తెలియలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఒక పత్రికలో వచ్చిన కథనం, అందులోని సుబ్బారావు ఫోటోని చూసి గుర్తించిన వారు ఆనందించడంతో పాటు ఆయన క్షేమం గురించి ఆందోళనకు లోనయ్యారు. అందుకే వెంటనే సుబ్బారావును వెంటబెట్టుకొని తెచ్చేందుకు తమిళనాడు బయలుదేరి వెళ్లారు...

సుబ్బారావు అక్కడకి ఎలా చేరాడు...సెల్వరాజ్ గా ఎలా మారాడు

సుబ్బారావు అక్కడకి ఎలా చేరాడు...సెల్వరాజ్ గా ఎలా మారాడు

ఇంతకీ సుబ్బారావు అక్కడి ఆశ్రమంలో ఎలా చేరివుంటాడంటే...అతడు మతిస్థిమితం లేనికారణంగా ఎక్కడెక్కడో తిరుగుతూ తమిళనాడు ఈ కాంచీపురం వృద్ధాశ్రమం నిర్వహించే మరో వృద్దాశ్రమానికి చేరాడు. అయితే అందులో సుబ్బారావును చేర్చుకోవడం వెనుక కూడా ఒక కారణం ఉంది. అదేమిటంటే సెయింట్‌ జోసెఫ్‌ హోస్పీస్‌ అనే సంస్థ నిర్వహించే వృద్ధాశ్రమంలో స్థానికులైన వృద్దులను ఎవరినీ చేర్చుకోరు. ఈ నిబంధన ఎందుకో, ఏమిటో ఎవరికీ తెలిసేది కాదు...ఇక్కడ కేవలం బయట ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వృద్ధులకు మాత్రమే ఆశ్రయం కల్పిస్తుండటం గమనార్హం. ఈ కారణంగానే గుంటూరు వాసి రెడ్డి సుబ్బారావుకు ఇక్కడ ఆశ్రయం దొరికి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం...కాంచీపురంలోని పాలేశ్వరం గ్రామంలో 19 ఎకరాల విస్తీర్ణంలో విదేశీ నిధులతో సెయింట్‌ జోసెఫ్‌ కరుణై ఇల్లమ్‌ పేరిట ఈ వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వృద్ధాశ్రమంలో నిరాశ్రయులైన వృద్ధులు, మహిళలు, మతిస్థిమితం కోల్పోయినవారు సుమారు 300 మందికిపైగా ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వృద్ధులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ వృద్ధాశ్రమం పనితీరుపై కొన్నేళ్ల నుంచి స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాశ్రమం వెనుకవైపు నుంచి విపరీతంగా దుర్వాసన వస్తోందని అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది.

 సెయింట్‌ జోసెఫ్‌ హోస్పీస్‌ సంస్థపై...అనుమానాల వెల్లువ...

సెయింట్‌ జోసెఫ్‌ హోస్పీస్‌ సంస్థపై...అనుమానాల వెల్లువ...

తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా పాలేశ్వరం వృద్ధాశ్రమంలోని ఆశ్రయం పొందే వృద్దులు వరుసగా అనుమానాస్పద స్థితిలో చనిపోతూవుండటంపై స్థానికుల్లో అనుమానాలు ఉన్నాయి. చనిపోయిన తరువాత ఆ వృద్దుల మృతదేహాలను బాగా కుళ్లబెట్టి ఆ తరువాత మాంసం ఊడిపోగా మిగిలిన అస్థిపంజరాన్ని బాగా ఎండబెట్టి శుభ్రం చేసి దానిని విదేశాలకు అమ్ముతున్నట్లుగా భావిస్తున్నారు. తాజా ఘటనతో పాలేశ్వరం సహా తమిళనాడు అంతటా వృద్ధాశ్రమాలను నిర్వహిస్తున్న సెయింట్‌ జోసెఫ్‌ హోస్పీస్‌ అనే సంస్థపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థపై వచ్చిన ఆరోపణల గురించి ‘సెయింట్‌ జోసఫ్‌ కరుణై ఇల్లం' నిర్వాహకుడు ఫాదర్‌ థామస్‌ ప్రశ్నించగా పొంతన తేని సమాధానాలు చెప్పడం గమనార్హం. తాము ఒక వినూత్న పద్దతిలో

మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామంటూ చెప్పుకొచ్చాడు. పైగా తమ సంస్థ ప్రభుత్వ అనుమతితోనే ఆశ్రమం నడుపుతోందని, ఆశ్రమంలో అనారోగ్యం కారణంగా మృతి చెందేవారిని ఖననం, దహనం చేయకుండా ఈ విధంగా కొత్తపద్ధతిలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. అంతేకాదు తమ ఆశ్రమంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని, తామెటువంటి తప్పులు చేయలేదని అంటున్నాడు.

 ఏంటో ఆ కొత్తపద్దతి...తిరిగి ప్రశ్నిస్తే...జవాబు లేదు...

ఏంటో ఆ కొత్తపద్దతి...తిరిగి ప్రశ్నిస్తే...జవాబు లేదు...

సరే మృతదేహాల అంత్యక్రియలు విషయంలో మీరు అనుసరిస్తున్న ఆ కొత్త పద్ధతి ఏంటో వివరంగా చెప్పమని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన మౌనమే సమాధానం అయింది. మరోవైపు తాజా ఫిర్యాదుల నేపథ్యంలో వరుసగా రెండోరోజు కూడా పాలేశ్వరం ఆశ్రమంలో అధికారుల తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆశ్రమంలో విడిగా ఉన్న ఒక భవనాన్ని అధికారులు గుర్తించారు. అందులో 20 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, 30 అడుగుల లోతున నిర్మించిన ఒక తొట్టె ఉండటాన్ని వారు గమనించారు. ఆ తొట్టె ఎందుకోసమని అధికారులు ఆశ్రమ నిర్వాహకులని అడుగగా వారు పొంతన లేకుండా జవాబిచ్చారు. పైగా ఈ ఆశ్రమంలోని ఓ గోడలో శవాలను వరుసగా నిలబెట్టి ప్లాస్టింగ్ చేసి దాచి ఉంచారన్న ప్రచారం గతంలో జోరుగా సాగిందట. దీంతో ఈ విషయంపై కూడా అధికారులు దృష్టిసారించారు. మరోవైపు 2017 సెప్టెంబర్‌తోనే ఈ వృద్ధాశ్రమం లైసెన్సు గడువు ముగిసినా మళ్లీ రెన్యూవల్ చేసుకోకుండానే ఆశ్రమం నడుపుతున్న విషయం కూడా బైటపడింది. తమ విచారణ అనంతరం శనివారం నాటికల్లా కాంచీపురం కలెక్టర్‌ పొన్నయ్యకు నివేదికను అందిస్తామని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur: An unexpected twist occurred in Tamil Nadu's Paleshwaram corpse business issue. Selvaraj, who was casing brought to light this issue is known as originally he belongs to Guntur. In other sideofficials went for a site inspection on Wednesday continue second day search, They were surprised to find that the hospice did not just take care of the destitute elderly, but also had a multi-tier vault for storing corpses. The vaults appeared like bank lockers. After a certain number of years, the vaults were reused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more