వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా కేంద్రం కరుణిస్తుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపైన ఈరోజు బడ్జెట్లో ప్రకటనలు ఉంటాయని, బడ్జెట్ కేటాయింపులపై గంపెడు ఆశలు పెట్టుకుంది ఏపీ. ఎప్పటి నుండో ఆశగా ఎదురుచూస్తున్న అనేక అంశాలకు ఈ బడ్జెట్లో స్థానం ఉంటుందని భావిస్తుంది.

|
Google Oneindia TeluguNews

నేడు దేశ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023- 2024 బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజల నుంచి, అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు బడ్జెట్లో తమ తమ రాష్ట్రాలకు జరగాల్సిన కేటాయింపుల పైన గంపెడు ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నాయి.

 నేడు కేంద్ర బడ్జెట్ పై ఏపీ గంపెడు ఆశలు

నేడు కేంద్ర బడ్జెట్ పై ఏపీ గంపెడు ఆశలు


ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి లోటు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు లోటు బడ్జెట్ భర్తీ కాకపోవడంతో ఈసారైనా రెవెన్యూ లోటు భర్తీకి బడ్జెట్లో పూర్తి నిధులను కేంద్రం కేటాయిస్తుందని గంపెడు ఆశలను పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక అంశాల పైన కూడా ఈరోజు బడ్జెట్లో ప్రకటనలు ఉంటాయని ఏపీ భావిస్తుంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీ ఆశిస్తున్న వివిధ అంశాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నిధులు ఇవ్వాలని ఎదురుచూపులు

రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నిధులు ఇవ్వాలని ఎదురుచూపులు

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతుంది. రాష్ట్రాన్ని విభజించిన సంవత్సరం ఏర్పడిన రెవిన్యూ లోటు ఇప్పటివరకు భర్తీ కాలేదు. ఇక కరోనా వంటి మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత పతనం అయ్యింది. దీంతో ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేంద్రం నిధులను కేటాయించాలని, ఏపీ రెవిన్యూ లోటును భర్తీ చేయాలని ఆశిస్తుంది. అంతేకాదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ సంస్థలకు జాతీయ గ్రాంట్ల రూపంలో బడ్జెట్లో తగినన్ని నిధులను కేటాయించాలని ఏపీ ఆశిస్తోంది.

ప్రధానికి కూడా జగన్ వినతులు... బడ్జెట్ కేటాయింపులపై ఏపీ ఆశలు

ప్రధానికి కూడా జగన్ వినతులు... బడ్జెట్ కేటాయింపులపై ఏపీ ఆశలు

ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న సమయంలో కూడా రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి ఏపీ రెవిన్యూ లోటు భర్తీకి నిధులను మంజూరు చేయాలని కోరినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఈసారి ఈ బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపు పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు ఏపీ ప్రజలు.

 పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల సాయం కోసం నిరీక్షణ

పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాల సాయం కోసం నిరీక్షణ


ఇక అంతే కాదు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని వెనుకబడిన జిల్లాలకు, ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ప్రత్యేక అభివృద్ధి సాయం కింద బడ్జెట్లో 24, 350 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేకాదు విశాఖకు మెట్రో రైలు మంజూరు చేయాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలలో జిల్లాకు వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి కావలసిన నిధులు కేటాయించాలని ఏపీ ఆశిస్తోంది.

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ ఆశలు

ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ ఆశలు


ఇక అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో, అభివృద్ధి వికేంద్రీకరణకు కూడా నిధులను కేంద్రం నుంచి కోరుతోంది.రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను కూడా ఆమోదించాలని కోరుతోంది.

ఏపీ ఆశలు నేరవేరతాయా?

ఏపీ ఆశలు నేరవేరతాయా?

రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రకటించిన పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద పది సంవత్సరాలు పాటు జీఎస్టీ రియంబర్స్మెంట్, ఆదాయపన్ను మినహాయింపు, 100% ఇన్సూరెన్స్ ప్రీమియం రియంబర్స్మెంట్ లను కేంద్ర బడ్జెట్ లో ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆశగా ఎదురుచూస్తుంది. మరి ఈరోజు నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ ఆశలు నెరవేరుతాయా.. ఈసారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం కరుణిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.

English summary
Andhra Pradesh has high hopes for the Union Budget. The Andhra Pradesh govt is hopeful that grants will be given to national institutions and that the Center will allocate funds to compensate for the revenue shortfall as mentioned in the state redistribution act..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X