ఏపీ సమస్యలకు పరిష్కారం చూపుతాం - అవి రాష్ట్రాల సమస్యలే కాదు : సీఎం జగన్ కు అమిత్ షా హామీ..!!

ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తావించిన ఏపీ సమస్యలు..అంశాల పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ చెప్పిన సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని..పరిష్కారం చూపుతామని అమిత్ షా హామీ ఇచ్చారు. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రత్యేక హోదాతో సహా పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

పోలవరం ప్రమాదంలో పడుతోంది

పోలవరం ప్రమాదంలో పడుతోంది

తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయలేదని వాపోయారు. రాష్ట్ర విభజన సమయం నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా నష్టం జరిగిందీ లెక్కలతో వివరించారు. అదే సమయంలో పోలవరం విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. జాతీయ ప్రాజెక్టు..జీవనాడిగా పేర్కొంటూనే పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013-14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్నారు.

గత ప్రభుత్వ అప్పులను చూపుతూ

గత ప్రభుత్వ అప్పులను చూపుతూ

దీని కారణంగా పోలవరం ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసారు. పరిమితికి మించి అంటూ కేంద్ర ప్రభుత్వం రుణాల వ్యవహారంలో కట్టడి చేస్తోందన్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవి గ్రాంట్‌కాదు. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సేకరిస్తున్న రుణాల ఇవి. ఈ రుణాలను సక్రమంగా తీరుస్తోంది కూడా. అలాంటప్పుడు నికర రుణ పరిమితిలో కోత విధించడం సరికాదు. గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందంటూ.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని వివరించారు. మరోవైపు ఇప్పటికే కోవిడ్‌ మహమ్మారితో ప్రభుత్వం సతమతమవుతోంది. అందువల్ల ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా కేంద్ర హోంమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.

కుప్పంకు తాగునీరు అందించేందుకు

కుప్పంకు తాగునీరు అందించేందుకు


పాలారు ప్రాజెక్టు నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం కాలడ్డుతోందని, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కుప్పం ప్రజలకు తాగునీరు అందుతుందని, ఈ విషయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. పాలారు ప్రాజెక్టు ద్వారా కేవలం 0.6 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వచేస్తున్నాం. మరోవైపు తమిళనాడు అవసరాలకోసం ఏటా దాదాపు 10 టీఎంసీల నీటిని పంతున్నాం. ఇలాంటి నేపథ్యంలో పాలారు నిర్మాణానికి సహకరించేలా చూడాలని కేంద్రాన్నిఅభ్యర్ధించారు.

Recommended Video

    AP MLC Elections : అభ్యర్ధుల ఎంపిక పూర్తి .. కొత్తగా 14 మంది ఖరారు..! || Oneindia Telugu

    మీ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలంటూ


    నిర్ణీత వ్యవధిలో రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా స్వీయ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రిని సీఎం జగన్ కోరారు. నాడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఏపీ జెన్‌కో తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసింది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి, సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసారు. ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించిన అంశాల పైన స్పందించిన కేంద్ర హోం మంత్రి వీటిని పరిగణలోకి తీసుకోవటంతో పాటుగా వాటిని పరిష్కారం చూపు దిశగా చర్యలు ఉంటాయని సమావేశంలోనే హామీ ఇచ్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+