AP: ఒక రోజు ముందుగానే ఉండవల్లికి అమిత్ షా..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బుధవారం నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి పలువురు అతిథులు రానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు.
కూటమిలోని తెదేపా, భాజపా, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో వస్తారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రమాణస్వీకారానికి రానున్నారు. దాదాపు 14 ఎకరాల్లో సభా ప్రాంగణం 65 వేల ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

రేపటి ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి ముందు రోజే అమిత్ షా అమరావతి వస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు ఉండవల్లిలోని బాబు నివాసం లో ఇరువురు నేతల భేటీ కానున్నారు. ఎన్డీఏలో టీడీపీ కీలక కావడంతో బీజేపీ నేతలు టీడీపీతో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఎన్డీఏ కూటమి నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బలపరిచారు.












Click it and Unblock the Notifications