చంద్రబాబుకు అర్దమైంది, మాతో ఇదీ ప్రతిపాదన - అమిత్ షా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు గతంలో ప్రధాని మోదీ పైన చేసిన కామెంట్స్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. టీడీపీ తిరిగి ఎన్డీఏలో చేరటం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
అమిత్ షా వ్యాఖ్యలు : 2019 ఎన్నికల సమయంలో నాడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ కూటమితో జత కట్టారు. 2019 ఎన్నికల్లో ఓడిన తరువాత చంద్రబాబు మౌనం పాటించారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలో చేరారు. ఇదే అంశం పైన ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇండియా టూడే ఎన్ క్లేవ్ లో భాగంగా ఇదే అంశం పైన స్పందించారు. చర్చలో భాగంగా యాంకర్ ఏపీలో పొత్తులను ప్రస్తావించారు. గతంలో ప్రధాని మోదీని టీడీపీ అధినేత చంద్రబాబు టెర్రరిస్ట్ అని వ్యాఖ్యానించారని గుర్తు చేసారు. అదే టీడీపీతో తిరిగి ఎలా పొత్తు పెట్టుకున్నారని ప్రశ్నించారు. దీని పైన అమిత్ షా స్పందించారు.

చంద్రబాబు ముందుకొచ్చారు : తాము ఎన్డీఏ నుంచి చంద్రబాబును వెళ్లమని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయం తీసుకొని వెళ్లిపోయారని స్పష్టం చేసారు. ఎన్నికల్లో ఓడిపోయారని..అర్దం చేసుకొని తిరిగి ఇప్పుడు ఏన్డీఏలో కలుస్తానని తమ వద్దకు వచ్చారని అమిత్ షా వెల్లడించారు. దీంతో, ఆయన్ను తిరిగి కలుపుకున్నామని వివరించారు. అదే సమయంలో మరో ప్రశ్నగా ఎన్డీఏకు వైసీపీ అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వగా.. ఆ పార్టీని కాదని టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సిందని ప్రశ్నించారు. దీనికి అమిత్ షా..తన సమాధానంగా వైసీపీ తమకు అన్ని బిల్లులకు మద్దతు ఇవ్వలేదని చెప్పారు. ఆ పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగానే మద్దతు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లో పార్టీల పరంగా నిర్ణయాలు ఉండవని షా స్పష్టం చేసారు.
చంద్రబాబును ఉద్దేశించి అమిత్ షా వ్యాఖ్యలు @ncbn #EndOfTDP #JokerTDP #BJP #Chandrababu #AndhraPolitiks pic.twitter.com/20CJB0sZrU
— Rmkr Pegs (@rmkr_pegs) March 15, 2024
హోరా హోరీ రాజకీయం : పార్టీలకు వారి అజెండాలు, సిద్దాంతాలు ఉంటాయన్నారు. వాటికి అనుగుణంగా పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయని వివరించారు. ఇప్పుడు అమిత్ షా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ నేతలు ఆహ్వానిస్తేనే తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అమిత్ షా..చంద్రబాబు తమతో కలిసేందుకు ముందుకు వచ్చారని చెప్పిన అంశాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఇక, పొత్తులో భాగంగా సీట్ల పైన మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చారు. రేపు (ఆదివారం) ప్రధాని మోదీ మూడు పార్టీల కూటమి బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుండటంతో.. ఏపీలో ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications