కేంద్రం కీలక ప్రతిపాదన - ఏపీ , తెలంగాణ అంగీకరించేనా..!!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఢిల్లీలోని ఏపీ-తెలంగాణ భవన్ విభజన కు సంబంధించి కేంద్ర హోం శాఖ కీలక ప్రతిపాదన చేసింది. విభజనపై అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనలు కోరిన కేంద్ర హోంశాఖ తాజా ప్రతిపాదనపై అభిప్రాయం లేదా అంగీకారాన్ని వారం రోజుల్లోగా తెలియజేయాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 66 ప్రకారం రాష్ట్రం వెలుపలి ఉమ్మడి ఆస్తుల విభజన కోసం జనాభా నిష్పత్తి (58:42) ప్రకారం పంచుకోవాల్సి ఉంటుంది.
రెండు రాష్ట్రాల ప్రతిపాదనలు:ఆంధ్రప్రదేశ్ భవన్ మొత్తం విస్తీర్ణం 19.73 ఎకరాల్లో ఉంది. అందులో 58:42 నిష్పత్తిలో లెక్కిస్తే తెలంగాణకు 8.41 ఎకరాలు (41.68%) భూభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11.32 ఎకరాల (58.32%) స్థలాన్ని పంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న భవన్ స్థలం అంతా ఒకే చోట లేదు. గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలం ఒకదానికొకటి ఆనుకుని మొత్తం 12.09 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఇందులో గోదావరి, శబరి బ్లాకుల్లో నిర్మించిన భవనాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ప్రతిపాదనలు తీసుకొచ్చింది. వీటిని కేంద్ర హోంశాఖ ఆప్షన్ ఏ, బీ, సీ గా పేర్కొంది. తెలంగాణకు శబరి బ్లాక్, పటౌడీ హౌస్ లో సగభాగం, ఏపీకి పటౌడీ హౌస్ లో మిగిలిన సగభాగం, గోదావరి బ్లాక్ ,నర్సింగ్ హాస్టల్ బ్లాక్ ప్రతిపాదించింది.

కేంద్రం కీలక సూచన:ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ ప్రకారం 12.09 ఏకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని తెలంగాణకు ఇచ్చి, పటౌడీ హౌజ్ (7.64 ఏకరాలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణకు దక్కాల్సిన వాటా కంటే అదనంగా ఇస్తున్న భూమికి తగిన విలువను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ ప్రతిపాదనలో పేర్కొన్నట్టు సమాచారం. దీన్ని కేంద్ర హోంశాఖ ఆప్షన్-డీగా రికార్డుల్లో పేర్కొంది. ఇప్పుడు కేంద్రం చేసిన ప్రతిపాదనలో 7.64 ఏకరాల్లో ఉన్న పటౌడి హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని, మిగిలిన 12.09 ఏకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సూచించింది.

ప్రభుత్వాలు అంగీకరిస్తాయా:ఈ సూచనతో జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు దక్కాల్సినంత భూమి దాదాపుగా వస్తుందని, స్వల్పతేడాకు ఇవ్వాల్సిన మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సానుకూలత వ్యక్తం చేస్తూ ఆమోదయోగ్యంగా, సాధ్యపడేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై పరిశీలించి తమ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖకు తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణ అధికారులు ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతనే తెలియజేస్తామని చెప్పినట్టుగా తెలిసింది. ఆప్షన్-సీ, ఆప్షన్-డీ, ఆప్షన్-ఈ పై రెండు రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాలు, వీలైతే అంగీకారం తెలపాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications