సీఎం జగన్ కు కేంద్ర మంత్రి అభినందనలు - సంపూర్ణ సహకారం అందిస్తాం..!!
ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగిసింది. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు హాజరయ్యారు. తొలి రోజు సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు లేన్ల జాతీయ రహదారికి నిధులు ప్రకటించారు. రెండో రోజు సదస్సులో ఇద్దరు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఏపీకి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జీఐఎస్ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారని సీఎం జగన్ ను మంత్రి అభినందించారు. మరో మంత్రి సర్భానంద సోనోవాల్ ఏపీ కీలక రాష్ట్రంగా అభివర్ణించారు. ఏపీ పోర్టులకు సహకారం ఉంటుందన్నారు.
విశాఖ లో పెట్టుబడి దారుల సదస్సులో కేంద్రం సహకారం పైన మంత్రుల నుంచి సానుకూలత వ్యక్తమైంది. మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి సమాఖ్య స్ఫూర్తితో ఏపీకి అన్ని విధాల సహకారం ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు, నైపుణ్యం గల మానవ వనరులు ఏపీ సొంతమని చెప్పారు. పలు కీలక రంగాల్లో కనెక్టివిటి పెరిగిందని వివరించారు. ప్రతిభ గల యువత ఏపీలో ఉందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించిందన్నారు. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని చెప్పారు. నూతన భారత నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్నారు.

కేంద్ర పోర్టులు..షిప్పింగ్ శాఖా మంత్రి సర్భానంద సోనోవాల్ దేశంలో విశాఖ ప్రత్యేక నగరంగా నిలిచిందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొనటం పై సంతోషం వ్యక్తం చేసారు. ఏపీ అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తోందని.. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సాయం అందుతుందని సోనోవాల్ హామీ ఇచ్చారు. సదస్సుకు హాజరైన పారిశ్రామిక వేత్తలను సీఎంతో కలిసి ఇద్దరు కేంద్ర మంత్రులు సత్కరించారు. ఈ సదస్సు ద్వారా రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సదస్సులో చేసుకున్న ఒప్పందాలు గ్రౌండ్ అయ్యేలా పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ సదస్సు ముగింపు సందేశంలో ప్రకటించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications