జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ... అవినీతి, అరాచకాలు , దౌర్జన్యాలు అంటూ

ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రాయలసీమ జోన్ జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసత్యాలతో జగన్ ప్రభుత్వం కాలం గడుపుతోంది అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఏపీలో అహంకారపూరితమైన,అభివృద్ధి నిరోధక పాలన నడుస్తోందని మండిపడ్డారు.

ఏపీలో పోలీసు రాజ్యం

ఏపీలో పోలీసు రాజ్యం

ఏపీలో పోలీసురాజ్యం నడుస్తుందని,అనవసరంగా తప్పుడు కేసులు పెట్టి మరీ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసినా పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నారని, తనకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీలో అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి అని ఆయన అభిప్రాయపడ్డారు.

నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్ కూడా

నాడు చంద్రబాబు చేసిందే నేడు జగన్ కూడా

గతంలో చంద్రబాబు హయాంలో కూడా అవినీతి, అసత్య పాలనే కొనసాగిందని ఇప్పుడు కూడా పరిస్థితి అదే విధంగా ఉందని మండిపడ్డారు. వైయస్ఆర్సిపి పాలనలో అవినీతి వికేంద్రీకృతమైందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీలు మారినా,నిరసనలు తెలియజేసిన, ప్రభుత్వ విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినా కూడా కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు.

ఏపీలో ఇసుక, మద్యం మాఫియాలు

ఏపీలో ఇసుక, మద్యం మాఫియాలు

ఇక ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఏపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ఇక మొన్నటి వరకు చంద్రబాబు, ఇక ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వారే అయినా,ముఖ్యమంత్రి పదవులు దక్కించుకున్నారాయలసీమను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో వైసిపి పాలనలో ఇసుక మాఫియా ,మద్యం మాఫియా లు చెలరేగుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

Recommended Video

    Thalapathy Vijay Birthday : Watch Jagan & Actor Vijay Posters In TN || Oneindia Telugu
    వైసీపీ పాలనా లోపాలను ఎత్తి చూపిన బీజేపీ నేతలు

    వైసీపీ పాలనా లోపాలను ఎత్తి చూపిన బీజేపీ నేతలు

    పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరం పనులు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కన్నా లక్ష్మీనారాయణపేర్కొన్నారు.ఇక వైసీపీ వైఖరి మార్చుకోకుంటే ఏపీలో బీజేపీ పోరాటం సాగిస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ తేల్చిచెప్పారు. ఇక జన సంవాద్ వర్చువల్ ర్యాలీలో వైసీపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపారు బీజేపీ ముఖ్య నేతలు . ఇక అదే సమయంలో కేంద్రం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+