ఆర్ఆర్ఆర్ రికార్డులంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్: స్పందించిన మూవీ యూనిట్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు రాంచరణ్ తేజ్, ఎన్టీఆర్ కథానాయకులుగా రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. భారతీయ చలనచిత్ర రికార్డులను ఆర్ఆర్ఆర్ తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ చిత్రాన్ని ప్రస్తావిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ గురించిన వివరాలు వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ రికార్డులతో భారత ఆర్థిక వ్వవస్థను పోలుస్తూ కేంద్రమంత్రి
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' సినిమానే నడుస్తుంది దేశమంతా. ఇది చాలా పెద్ద సినిమా, ఇప్పటికే 750 కోట్ల కలెక్షన్లని రాబట్టి రికార్డులని సృష్టిస్తుందని విన్నాను. 'ఆర్ఆర్ఆర్' లాగే భారత ఆర్ధిక వ్యవస్థ కూడా రికార్డులని బద్దలు కొట్టే బిజీలో ఉంది అని అన్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్
కాగా, ఈ వీడియోని 'ఆర్ఆర్ఆర్'టీం షేర్ చేసింది. అంతేగాక, 'మీ(కేంద్రమంత్రి పీయూష్ గోయల్) సినిమా గురించి మంచి మాటలకు ధన్యవాదాలు పీయూష్ గోయల్ జీ. సినిమాలు అనేవి ఒక దేశం సాఫ్ట్‌పవర్. భారతదేశ వృద్ధిలో చిన్న భాగం అయినందుకు మేము కూడా సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరిన్ని భారతీయ చిత్రాలు పాత్ బ్రేకింగ్ రికార్డులు సృష్టిస్తాయని ఆశిస్తున్నాము" అంటూ పోస్ట్ చేసింది.

ఆర్ఆర్ఆర్ రికార్డులు.. వెయ్యి కోట్ల దిశగా..
'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ అయి పది రోజులు కావొస్తున్నా ఇంకా చాలా చోట్ల హౌస్‌ఫుల్ షోలు నడుస్తున్నాయి. ఈ చిత్ర యూనిట్ కూడా వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హడావిడి చేస్తూనే ఉంది. ఇక కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 750 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రంరూ. 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాని అభిమానులు, ప్రేక్షకులు, సెలబ్రిటీలు అభినందిస్తున్నారు. తాజాగా సెంట్రల్ మినిష్టర్ పీయూష్ గోయల్ కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమాని అభినందించడంతో సినిమా యూనిట్ తోపాటు ఎన్టీఆర్, రాంచరణ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం బాషల్లో ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications