ఏపీలో పీయూష్ గోయల్ కు తప్పిన పెను ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర నిలిపివేత..
కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ తిరుపతి నుంచి కృష్ణ పట్నం వెళ్లేందుకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కారు. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. సీఎం, వీఐపీలు వాడే విమానాల పటిష్టతపై నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిరుమల తిరుపతిని సందర్శించి.. తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. మరోవైపు జూన్ 15న అమరావతిలో సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ అయ్యారు. పొగాకు రైతుల సమస్యలపై చర్చించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక దేశంలో విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా ఉత్తరాఖండ్ లోనూ విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకెళుతున్న సమయంలో గౌరీకుండ్ అడవుల్లో విమానం కుప్పకూలింది.












Click it and Unblock the Notifications