జగన్ కు కేంద్రమంత్రి మరో ఆఫర్- మాతో కలిస్తే ఇద్దరికీ మేలు-వైసీపీ అధినేత ఆలోచన అదే..
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన తర్వాత బీజేపీకి దగ్గర కావడం మొదలుపెట్టిన వైసీపీ అధినేత కమ్ సీఎం జగన్ కు కేంద్రమంత్రుల ఆఫర్లు పెరుగుతున్నాయి. ఓవైపు బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నా అంటీ ముట్టనట్టుగా ఉంటున్న జగన్ ను ఎలాగైనా ఎన్డీయేలో చేర్చడంతో పాటు ఏపీలోనూ కొత్త పొత్తులకు కేంద్రమంత్రులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గతంలో ఓ ఆఫర్ ఇచ్చిన కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే.. ఇప్పుడు మరో ఆఫర్ కూడా ఇచ్చారు. దీనికి వైసీపీ అధినేత అంగీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

కేంద్రంతో జగన్ ప్రయాణం
ఏపీలో అధికారంలోకి రాకముందు వైసీపీని లైట్ తీసుకున్న కేంద్రంలోని బీజేపీ, ఎన్డీయే పార్టీలు 2019 తర్వాత మాత్రం రూటుమార్చాయి. ముఖ్యంగా ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో పాటు లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో ఆరో అతిపెద్ద పార్టీగా కూడా వైసీపీ అవతరించడంతో బీజేపీకి జగన్ ప్రభావం అర్ధమైంది. అయితే ఇంత ఫామ్ లో ఉన్నా వైసీపీని వాడుకునేందుకే బీజేపీ మొగ్గు చూపుతోంది. అదే సమయంలో తన అవసరాల మేరకే బీజేపీతో అంటీ ముట్టనట్టుగా జగన్ కూడా స్నేహం చేస్తున్నారు. దీంతో ఏపీకి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా జగన్ హయాంలో ఎన్డీయే అమలు చేయడం లేదు. అయినా జగన్ తప్పనిసరిగా బీజేపీతో దూరం నుంచే స్నేహం చేయాల్సిన పరిస్దితి.

ఎన్డీయేలో చేరాలని ఆఫర్లు
ఓవైపు ఏపీలో ఏకపక్ష విజయంతో బలమైన రాజకీయపార్టీగా మారిపోవడంతో పాటు అటు పార్లమెంటులో సైతం భారీ స్ధాయిలో ఎంపీల్ని కలిగిన వైసీపీని ఎలాగైనా ఎన్డీయేలో చేర్చుకునేందుకు బీజేపీ రెండేళ్లుగా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పలు ఆఫర్లు ఇస్తూనే ఉంది. లోక్ సభ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ వంటి కీలక పదవులతో పాటు కేంద్రమంత్రి పదవులనూ ఆఫర్ చేస్తోంది. అయినా జగన్ మాత్రం తలొగ్గడం లేదు. దీంతో జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా బీజేపీ ఎలాగో కేంద్రంలో చేరాలని కోరుతూనే ఉంది. దీనిపై జగన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు.

కేంద్రమంత్రి అథవాలే ఆఫర్లు
ఎన్డీయేతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ, నేరుగా అందులో చేరేందుకు మాత్రం జగన్ మొగ్గు చూపడం లేదు. దీంతో మొదట్లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు జగన్ ను అడిగి అడిగీ వదిలేశారు. ఆ తర్వాత కేంద్రమంత్రుల వంతు వచ్చింది. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే జగన్ ను అడగడం మొదలుపెట్టారు. ఏపీకి తరచూ రావడం, జగన్ ను ఎన్డీయేలో చేరారని కోరడం ఆయనకు పరిపాటిగా మారిపోయింది. తాజాగా అమలాపురం వచ్చిన ఆయన జగన్ ను తమతో చేతులు కలపాలని కోరారు. దీంతో జగన్ పై ఎన్డీయే ఆశ చావలేదని అర్ధమవుతోంది.

ఆర్పీఐతో పొత్తుకు అథవాలే ఆఫర్
తన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో వైసీపీ కలిసొస్తే ఇరు పార్టీలకు మేలు జరుగుతుందంటూ కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే మరో కొత్త పాట అందుకున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్ధితుల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకే జగన్ మొగ్గుచూపుతున్నారు. ఆ మాటకొస్తే మొదటి నుంచీ వైసీపీ వైఖరి అదే. అయినా అథవాలే మాత్రం ఏపీలో అయినా కలిసి పోటీ చేస్తే ఇద్దరికీ మేలు జరుగుతుందంటూ కొత్త ఆఫర్లు ఇస్తున్నారు. వాస్తవానికి ఏపీలో ఆర్పీఐకి కనీస ఓటు బ్యాంకు కూడా లేదు. వైసీపీతో పొత్తు ద్వారా ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న అథవాలే.. ఇప్పుడు తమతో పాటు బీజేపీతో కలిస్తే జగన్ కు మేలు జరుగుతుందంటూ కొత్త పాట పాడుతున్నారు.
Recommended Video

జగన్ భయం అదేనా ?
ఎన్డీయేతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నా బహిరంగంగా మాత్రం పొత్తు పెట్టుకునేందుకు జగన్ అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన ఓటు బ్యాంకే. వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు బీజేపీకి బద్ధ వ్యతిరేకులు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వీరంతా తనకు దూరం కావడం ఖాయమని జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఇప్పటివరకూ బీజేపీతో పొత్తు కానీ, కేంద్రంలో చేరడం గురించి కానీ మాటమాత్రమైనా ఎక్కడా మాట్లాడలేదు. అదే సమయంలో గతంలో కేంద్రంలో చేరి ఆ తర్వాత తమ ఒత్తిడితో చంద్రబాబు బయటపడాల్సిన పరిస్ధితుల్ని జగన్ మర్చిపోలేదు. ఇప్పుడు కేంద్రంలో చేరితో తమకూ అదే దుస్ధితి తప్పదనేది జగన్ భయం. అందుకే కేంద్రానికి దూరంగా ఉంటూనే ఇరువురి అవసరాలు తీర్చుకుందామనే వైఖరి జగన్ లో కనిపిస్తోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications