జగన్ వారియర్స్ ధైర్యం వెనుక - చంద్రబాబు, పవన్ తో డైరెక్ట్ ఫైట్..!!
ఒకరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. మరొకరు అత్యంత ఆదరణ ఉన్న ప్రముఖ సినీ హీరో. ఈ ఇద్దరు నేతలకు అధికార పార్టీలోని ఎమ్మెల్యే డైరెక్ట్ ఫైట్ కు దిగుతున్నారు. దమ్ముంటే నా పై పోటీ చేసి గెలవాలి అంటూ తొడలు కొడుతున్నారు. కేంద్రంలోని అధికార పార్టీ అధ్యక్షుడైనా సరే తమ పార్టీ గురించి మాట్లాడితే తగ్గేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఎన్నికల వేళ తగ్గేదే లే అంటూ ఢీ అంటే ఢీ అంటున్న వీరు ఇప్పుడు జగన్ వారియర్స్ గా మారారు. వీరి ధైర్యం వెనుక ఉన్న ధీమా ఏంటి.

సీఎం వర్సస్ ప్రతిపక్షం
వై నాట్ 175 సీఎం జగన్ నినాదం. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం ఖాయమనేది వైసీపీ ధీమా. జగన్ ను ఓడించాలనేది ప్రతిపక్ష టీడీపీ..జనసేన లక్ష్యం. ఇందుకోసం పొత్తులు దాదాపు ఖాయమయ్యాయి. బీజేపీ సంగతి తేలాల్సి ఉంది. జగన్ ను మూడు వైపులా టీడీపీ..జనసేన చుట్టు ముడుతోంది. చంద్రబాబు జిల్లాల యాత్ర..లోకేశ్ పాదయాత్ర..పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో సీఎం జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. వీరి విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ సభల్లోనూ చంద్రబాబును నేరుగా.. మద్దతుగా నిలుస్తున్న పవన్ పేరు ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావన చేయకుండా దత్తపుత్రుడు..ప్యాకేజీ స్టార్ అంటూ పరోక్షంగా తాను చెప్పదలచుకున్నది చెబుతున్నారు.

ఢీ అంటే ఢీ అంటూ
కొంత కాలంగా ముఖ్యమంత్రి జగన్ కంటే వైసీపీలోని కొందరు నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు సమస్యగా మారారు. రోజా..కొడాలి నాని..పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి..వల్లభేని వంశీని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. కొడాలి నాని..వంశీ నేరుగా ఛాలెంజ్ చేస్తున్నారు. చంద్రబాబు..లోకేశ్ ఇద్దరూ తమ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి తమను ఓడించాలని సవాల్ విసురుతున్నారు. పెద్దిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని చంద్రబాబు ఛాలెంజ్ చేస్తే..కుప్పంలోనే చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీకి ఇప్పటి వరకు గుడివాడ, గన్నవరం లో అభ్యర్ధులను ఫైనల్ చేయలేదు. చంద్రబాబు..పవన్ పైన విమర్శల విషయంలో పేర్ని నాని..కొడాలి నాని..వల్లభనేని వంశీ..ఢీ అంటే ఢీ అంటున్నారు. వారి పైన పోటీకి సిద్దమంటున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాతి నేతలు వీరి వ్యాఖ్యలకు కౌంటర్ చేస్తున్నా..ఆ స్థాయిలో స్పందన కనిపించటం లేదు.

జగన్ వారియర్స్ సై
పవన్ కల్యాణ్ కాకినాడలో తొడ కొట్టి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన సవాల్ చేసారు. ద్వారంపూడిని ఓడించే బాధ్యత తనదేనని ప్రకటించారు. దీనికి ద్వారంపూడి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కాకినాడలో తనను ఓడించటం పవన్ తరం కాదని..దమ్ముంటే పవన్ తన మీద పోటీ చేసి గెలవాలని సవాల్ చేసారు. పవన్ కు ఈ స్థాయిలో స్పందన వస్తుందని జనసేన నేతలు అంచనా వేయలేదు. కాకినాడ నుంచి పోటీ విషయంలో ఇదే విధంగా పవన్ ను ద్వారంపూడి ఫిక్స్ చేసారు. పవన్ నిర్ణయం కీలకం కానుంది. ప్రతిపక్ష నేతలు జగన్ ను టార్గెట్ చేస్తూనే...జగన్ టీంలోని నేతలే నేరుగా చంద్రబాబు..పవన్ ను ఢీ కొడుతున్నారు. సీఎం జగన్ పైన నమ్మకం.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఈ నేతలు ఆ రెండు పార్టీ అధ్యక్షులను టార్గెట్ చేస్తున్నారు. దీంతో..ఎన్నికల వేళ ఈ డైరెక్ట్ ఫైట్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications