విచిత్ర వాతావరణం - అకాల వర్షాలు, తాజా అలర్ట్..!!

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న వేళ.. అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ అకాల వర్షాలు కురిశాయి. వర్షంతో బెంగళూరు నుంచి విమాన రాకపోకల పైనా ప్రభావం పడింది. ఈ వర్షాలతో ఉష్ణోగ్రతల నుంచి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉపశమనం దక్కింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఈదురు గాలులతో పాటుగా వడగండ్ల వాన ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

భిన్న వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటుగా వడగండ్ల వానతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండ లాల్లో సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రూ.36.11 కోట్ల విలువైన పలు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట కోత దశలోని అరటి, బొప్పాయితోపాటు మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో 110.5 హెక్టార్లలో చేతికొచ్చిన రూ.1.20 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో వీచిన ఈదురుగాలులకు వడగండ్లు కూడా తోడవడంతో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

unseasonal-rains-in-telugu-states-imd-latest-alerts-for-next-two-days

అకాల వర్షాలతో
దిగుబడులు వచ్చే సమయానికి పంట నేలమట్టమైదని రైతులు వాపోతున్నారు. లింగాల మండ లంలో దాదాపు 2455 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేసారు. బెంగళూరు విమానా శ్రయ ప్రాంతంలో వర్షం కురవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్ పై ప్రభావం చూపిందని ఇండిగో సంస్థ వెల్లడించింది. బెంగలూ లో కొన్ని రోడ్లపై వర్షం నీరు చేరి, ట్రాఫిక్‌ స్తంభించిన అంశాలను ప్రస్తావించింది. వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పంట నష్టం జరిగిన రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టం పై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.

తాజా అలర్ట్స్
ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ నుంచి మధ్య మహా రాష్ట్ర కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించినట్లు వెల్లడించింది. మరో వైపు బం ళాఖాతంలో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో సముద్రం నుంచి భూఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటికి వాయవ్య భారతం నుంచి వీచే పొడిగాలులు కలుస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో వాతావరణంలో అనిశ్చితి నెలకొని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ గాలులు వీచాయి. శ్రీసత్యసాయి జిల్లా గంజివారిపల్లెలో 33.25 మి.మీ., అన్నమయ్య జిల్లా వలసపల్లెలో 29.75 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గింది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులుతో వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండుచోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+