ఉపాసన మెగా డెసిషన్ - "గేమ్ ఛేంజర్"..!!

మెగా ఇంటి కోడలు ఉపాసన కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. సామాజిక - సేవా రంగాల్లో చురుకుగా ఉండే ఉపాసన కొణిదెల అపోలో వ్యవహారాల్లో కీలకంగా మారారు. తాత ప్రతాప్ రెడ్డితో కలిసి తమ గ్రూపు విస్తరణలోనూ ఉపాసన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు తాజాగా ఉపాసన మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయోధ్య కేంద్రంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

అయోధ్య కేంద్రంగా
రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపారం - సేవా రంగాల్లో దూసుకెళ్తున్నారు. తాజాగా అయోధ్య కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అపోలో గ్రూపు ద్వారా అయోధ్యలో ఎమర్జన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. కుటుంబ సభ్యుల తో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకున్న ఉపాసన ఎమర్జెన్సీ సెంటర్ ను ఓపెన్ చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ..ఆసక్తి కర అంశాలను జత చేసారు. అపోలో ద్వారా ఆధ్యాత్మిక కేంద్రాల్లో అందిస్తున్న సేవలను వెల్లడించారు.

Upasana Konidela launches Free Emergency Care Centre at Ayodhya as a service to pilgrims

భక్తుల కోసం
సనాతన ధర్మం గురించి తన తాత చాలా నేర్పించారని ఉపాసన పేర్కొన్నారు. అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం తమకు గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పారు. తాత మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తు న్నామని ఉపాసన వివరించారు. తమ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రముఖ క్షేత్రాలుగా ఉన్న తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో ఇప్పటికే అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్

ఇక, ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఉపాసన వెల్లడిం చారు. ఉపాసన చేసిన ప్రకటన వైరల్ గా మారింది. మెగా ఫ్యాన్స్.. నెటిజెన్లు సైతం ఉపాసనను అభినందిస్తున్నారు. అటు రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా ఉండనుంది. రామచరణ్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. కాగా, తమన్ సంగీతం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+