షాక్: టిడిపికి ఉరవకొండ సర్పంచ్ నర్రా సుజాత రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: ఉరవకొండ సర్పంచ్ నర్రా సుజాత, ఆమె భర్త నర్రా కేశన్న టిడిపికి రాజీనామా చేశారు. తమపై మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోదరుల వద్ద కొందరు చేరి తమను పార్టీకి దూరం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేసినట్టు చెప్పారు.

  నాకు పవర్ లేకుండా చేశారు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్య

  గురువారం నాడు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయానికి పంపారు. 20 సంవత్సరాలుగా టీడీపీలో క్రమశిక్షణతో పని చేశామన్నారు.

  Uravakonda sarpanch Narra sujatha resigns to TDP

  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీఎన్‌ఎస్‌ఎఫ్‌కు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడామన్నారు. తమపై కేసులు బనాయించారని వారు గుర్తు చేశారు.

  వాస్తవాలు పయ్యావుల సోదరులకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని నర్రా సుజాత ఆరోపించారు. ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో కూడ తమను పాల్గొనకుండా అడ్డుకొన్నారని ఆమె ఆరోపించారు.కొందరు వ్యక్తులు తమను పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా పని చేయడం బాధాకరమన్నారు. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Uravakonda Sarpanch Narra Sujatha , and her husband Narra Keshanna resigned to Tdp on Thursday . from 20 years we are working for tdp she said.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి