గోదావరిలో నిలిచిన పట్టు - బై పోల్ లో గెలుపు..!!
గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బై పోల్ లో యూటీఎఫ్ విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోరు లో తొలి రౌండ్ కౌంటింగ్ లోనే యూటీఎఫ్ అభ్యర్ధి గోపీ మూర్తి గెలుపొందారు. ఇక్కడ గెలుపును ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే, యూటీఎఫ్ ఇక్కడ మరో సారి తమ పట్టు నిరూపించుకుంది. కౌంటింగ్ పూర్తి కాకుండా తొలి రౌండ్ లో 50 శాతానికి పైగా ఓట్లను దక్కించుకున్న గోపీ మూర్తి విజయం పైన ప్రకటన ఇక లాంఛనంగా మారింది. ఈ సాయంత్రానికి అధికారికంగా ఫలితం వెల్లడి కానుంది.
గోదావరి పరిధిలోని అయిదు జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో యూటీఎఫ్ విజయం సాధించింది. తొలి ప్రాధాన్యత ఓట్లతో గోపీ మూర్తి కావాల్సిన మెజార్టీ నెంబర్ సాధించారు. ఈ నెల 5న జరిగిన ఎన్నిక ల్లో మొత్తం 15,495 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, 50 శాతం పైగా ఓట్లను దక్కించుకోవటంతో గోపీ మూర్తి విజయం ఖాయమైంది. కొత్తగా గెలిచిన ఎమ్మె ల్సీ కు రెండేళ్ల రెండు నెలల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ రోజు కాకినాడ జేఎన్టీయూలో 14 టేబు ళ్లలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. లెక్కింపు ప్రారంభమైన సమయం నుంచి గోపీ మూర్తి ఆధిక్యత కొనసాగుతోంది. 2/3 ఓట్లతో గోపీ మూర్తి విజయం ఖాయం చేసుకున్నారు.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఐదు జిల్లాల పరిధిలో 16,737 మంది ఓటర్లు ఉన్నారు. కానీ 15,490 ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 3418 మంది ఓటర్లు ఉన్నారు. ఉభయ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదం లో మరణించడంతో ఉపఎన్నికలు నిర్వహించారు. కాగా, ఈ ఎప ఎన్నికల్లో బుర్రా గోపి మూర్తి, డా.కవల నాగేశ్వరరావు, పలుగు దీపక్, గంధం నారాయణరావు, నామన వెంకటలక్ష్మి అభ్యర్ధులు పోటీలో నిలిచారు. ప్రచారంలో .. పోలింగ్ వరకు అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకోవటానికి అన్ని ప్రయత్నాలు చేసారు. ప్రత్యేక పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో విజయం ఖాయమైన గోపీ మూర్తిని పలువురు అభినందించారు.












Click it and Unblock the Notifications