వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగీరథ ప్రయత్నం: రామోజీరావుకు విహెచ్ ప్రశంస

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఓం పేరిట ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించడం పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ప్రశంసలు కురిపించారు. ఓం పేరిట ఆధ్యాత్మిక నగరం నిర్మించడం అభినందనీయమన్నారు.

ఓం నగరం ద్వారా తెలంగాణకు, హైదరాబాదుకు మరింత ఖ్యాతి వస్తుందన్నారు. అక్షరధామ్‌లా ఈ ప్రాజెక్టుకు మంచి పేరు వస్తుందన్నారు. రామోజీ రావు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. ఓం నగర నిర్మాణాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కాగా, ఇంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రశంసించారు.

కేసీఆర్ శుక్రవారం రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించి, దానిపై ప్రశంసల జల్లు కురిపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత, ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావును ఆయన కలిశారు. రామోజీ ఫిలింసిటీ తెలంగాణకే గర్వకారణమని కెసిఆర్ అన్నారు.

V Hanumantha Rao praised Ramoji Rao for OM City

రామోజీ ఫిలిం సిటీతో పాటు త్వరలో నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ఓం సిటీలను పర్యాటక ప్రదేశాలుగా మలచడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో కెసిఆర్ దాదాపు నాలుగు గంటలకుపైగా గడిపారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కేసీఆర్‌ ఫిలిం సిటీకి వెళ్లారు.

ఆయనను రామోజీరావు స్వయంగా స్వాగతించారు. వారు కలిసి భోజనం చేశారు. కొద్దిసేపు ఇరువురు ఏకాంతంగా సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఫిలింసిటీలోని ప్రత్యేక ఆకర్షణలను కేసీఆర్‌కు రామోజీ స్వయంగా చూపించారు. తాము ‘ఓం' పేరుతో కొత్తగా చేపట్టబోతున్న ఆధ్యాత్మిక నగరి ప్రాజెక్టు గురించి వివరించారు. ‘ఓం' ఆల్బమ్‌ను ఆయనకు అందించారు.

ఫిలింసిటీలో సినిమాల కోసం వేసిన సెట్టింగ్‌లను కేసీఆర్‌ ఆసక్తిగా తిలకించారు. ఆయన శుక్రవారం రాత్రి వరకు రామోజీ ఫిలిం సిటీలోనే గడిపినట్లు తెలిసింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసేందుకు రామోజీరావు అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలిసింది. అప్పుడు వివిధ కారణాలవల్ల సమయం కేటాయించలేకపోయిన కేసీఆర్‌ ఇప్పుడు తానే ఫిలిం సిటీకి వెళ్లినట్లు సమాచారం.

రామోజీ ఫిలింసిటీ ఒక అద్భుత కళాఖండమని, ఎంతో దీక్ష, తపన, బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఇలాంటివి తయారు కావని, ఫిలింసిటీ కంటే ఎక్కువగా పర్యాటకులను ఆకర్షించే ప్రదేశమిది అని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇది అద్భుతమైన బహుమతి అని అన్నారు.

తాను చాలా ప్రాంతాలు తిరిగానని, ఏదో చిన్న విస్తీర్ణంలో కొన్ని అంశాలకే అవి పరిమితంగా ఉంటాయని, కానీ రామోజీ ఫిలింసిటీ అద్భుతమని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ఫిలింసిటీలో తిరిగి చూశాను గానీ అప్పటికీ ఇప్పటికీ పొంతనే లేదని చెప్పారు.

ఓం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని, దేశంలోని ప్రముఖ దేవస్థానాల నకళ్లను, అంతే ఎత్తు, అదే పద్ధతితో నిర్మించి, నిత్య పూజలు బ్రహ్మాండంగా జరగనుందని కెసిఆర్ అన్నారు. ఇది పూర్తయితే, తెలంగాణకు, హైదరాబాద్‌కు మాత్రమే కాదు భారతదేశానికే అద్భుతమవుతుందని అన్నారు. ఒకేచోట దేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ రెండు మూడు రోజులు ఉండి చూసుకోవచ్చునని అన్నారు.

English summary
Telangana Congress MP V Hanumantha Rao praised Ramoji Rao for OM City.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X