వంశీ కేసులో జగన్ బుక్కవుతారా ? కస్టడీలో కీలక వాంగ్మూలం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన గన్నవరం ఆఫీసుపై దాడి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఏ71గా మాత్రమే ఉన్నారు.
పోలీసులకు పూర్తిస్దాయిలో ఆధారాలు కూడా లభించలేదు. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ కేంద్రంగా జరిగిన కుట్ర, ఇందులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు లింక్ ఉందా లేదా వంటి ఎన్నో అంశాల్ని పోలీసులు తవ్వుతున్నారు.

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ కాస్తా ఆ తర్వాత ఈ కేసులో ఫిర్యాదు దారుగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి హైదరాబాద్, విశాఖకు తిప్పిన ఆరోపణలపై ఆరెస్టు అయ్యారు. ఈ కేసులో ఆయన్ను పోలీసులు ఏ1గా చేర్చారు. దీంతో పాటు ఆయన అనుచరుల్ని కూడా అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి వంశీని తీసుకుని కీలక ప్రశ్నలు ఆధారాలతో సహా సంధిస్తున్నారు.
దీంతో వంశీ కస్టడీలో పోలీసులకు చెబుతున్న విషయాలు ఇప్పుడు ఆయనతో పాటు పార్టీ అధినేత వైఎస్ జగన్ కూ లింక్ అయ్యేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జగన్ ను కూడా ఈ కేసులో ఫిక్స్ చేయబోతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీన సత్యవర్ధన్ కిడ్నాప్ తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన వల్లభనేని వంశీ తాడేపల్లి వెళ్లి వైఎస్ జగన్ ను కలిసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కానీ కస్టడీలో తొలి రోజు ఈ విషయం అంగీకరించని వంశీకి ఆధారాలు చూపించేసరికి ఒప్పుకున్నారు.
దీంతో వంశీ-జగన్ భేటీలో జరిగిన చర్చ ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారిపోయింది. వంశీ తన అనుచరులతో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయించి బెదిరించిన వ్యవహారంలో జగన్ పాత్ర కూడా ఉందా, ఆయన డైరెక్షన్ ఏ మేరకు ఉందన్న కోణాల్లో పోలీసులు దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో జగన్ ను కలిశారన్న ఒక్క కారణంతో ఆయన్ను ఫిక్స్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి వంశీ-జగన్ చర్చల్లో మాట్లాడుకున్న అంశాలపై ఇవాళ మూడోరోజు కస్టడీలో కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ఇందులో ఏదైనా హింట్ దొరికితే మాత్రం సంచలనాలు నమోదు కావడం ఖాయమంటున్నారు.












Click it and Unblock the Notifications