వంశీ కేసులో ట్విస్ట్- జైల్లో సింగిల్ గా ఉంచొద్దని జడ్డికి రిక్వెస్ట్..!
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో అరెస్టు అయి రిమాండ్ పై ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీలో వంశీ పలు కీలక విషయాలు వెల్లడించారు. అయితే ఇంకా పలు విషయాలు ఆయన నుంచి రాబట్టాల్సి ఉండటంతో మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోనే ఆయన ఇవాళ జడ్డి ముందు ట్విస్ట్ ఇచ్చారు.
విజయవాడ సబ్ జైల్లో తనకు అదనపు సౌకర్యాలు కావాలని వల్లభనేని వంశీ గతంలో కోరడంతో ఆయనకు వెస్ట్రన్ కమోడ్ తో పాటు పడుకునేందుకు దిమ్మె ఉన్న రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే వంశీని సింగిల్ గా ప్రత్యేక రూమ్ లో పెట్టడంపై జడ్జి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జైల్లో ఇతర బ్యారెక్స్ లో ప్రమాదకర ఖైదీలు ఉన్నారని, వంశీ భద్రత దృష్ట్యా ఆయనకు ప్రత్యేక గది కేటాయించినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు వంశీ తనకు ప్రత్యేక గది వద్దంటున్నారు.

ఇవాళ మూడు రోజుల కస్టడీ ముగియడంతో పోలీసులు వల్లభనేని వంశీని కోర్టులో హాజరుపర్చారు. దీంతో కస్టడీలో ఇబ్బంది పెట్టారా అని వంశీని న్యాయమూర్తి అడిగారు. దీనిపై స్పందించిన వంశీ.. కేసుతో తనకు సంబంధం లేదన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని జడ్డికి తెలిపారు. అదే సమయంలో వేరే బ్యారక్‌లో తనకు వసతి కల్పించాలని వంశీ కోరారు.
ఒక్కడినే కాకుండా మిగతా ఖైదీలతో కలిపి ఉంచాలని వంశీ న్యాయమూర్తిని కోరారు. దీంతో మెమో దాఖలు చేయాలని వంశీకి కోర్టు సూచించింది. అలాగే వంశీ మెడికల్ రిపోర్టుల్ని పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ప్రస్తుతం వంశీ ఉంటున్న రూమ్ లో ఆయన ఒక్కరే ఉంటున్నారు. కానీ జైల్లో తనకు భద్రత లేదని కుటుంబ సభ్యులతో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కారణంతో ఆయన తనను ఒంటరిగా ఉంచవద్దని, మిగతా ఖైదీలతో కలిపి ఉంచమని ఇవాళ జడ్డిని కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై కోర్టు త్వరలో నిర్ణయం ప్రకటించనుంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications