వందే భారత్ కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్
ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను సమకూర్చడానికే భారతీయ రైల్వే ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా వివిధ నగరాల మధ్య రాకపోకలను పెంచడానికి తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా సెమీ హైస్పీడ్ రైళ్లైన వందే భారత్ ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న ఈ రైళ్లు అతి తక్కువ సమయంలోనే ప్రజల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి.
బీహార్ లో జులై 27న వందే భారత్ సేవలు ప్రారంభమయ్యాయి. పాట్నా నుంచి రాంచీ వరకు దీన్ని నడుపుతున్నారు. తాజాగా మరో వందే భారత్ ను అధికారులు అందుబాటులోకి తేబోతున్నారు. పాట్నా నుంచి హౌరా వరకు ఇది ప్రయాణించనుంది. ఆగస్టు రెండోవారం నుంచి సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 535 కిలోమీటర్లు. ఏడు గంటల్లో గమ్యస్థానానికి చేరుకునేలా ప్రణాళికలు రచించారు. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది.

వందే భారత్ రైళ్ళల్లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని మార్గాల్లో ఆక్యుపెన్సీ ఉండటంలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టిఫిన్, భోజనంతో కలిపి ఏసీ ఎగ్జిక్యూటివ్ టికెట్ రేటు రూ.2,650, ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,450గా నిర్ణయించారు. అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. కానీ ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.
ఈ వందే భారత్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్, జార్ఖండ్‌లోని జసిడిహ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణం మొత్తం పచ్చటి ప్రకృతి అందాల మధ్య సాగనుంది. ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని పాట్నా-జంజా- అసన్‌సోల్- హౌరా మెయిన్ లైన్‌లో పట్టాలను బలోపేతం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications