Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెరపైకొచ్చిన వంగా గీత

YS Jagan: తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఉప ఎన్నిక వ్యవహారం కాకినాడ‌ జిల్లా రాజకీయాలను వేడెక్కించింది. ఈ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు వివాదాలకు దారి తీశాయి. బలం లేనప్పటికీ తిరుపతి డిప్యూటీ మేయర్, హిందూపురం తరహా వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు నేడు ఛలో తుని ఆందోళనకూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నాయకురాలు, లోక్‌సభ మాజీ సభ్యురాలు వంగా గీత తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అనుసరిస్తోన్న ప్రలోభాల పర్వాన్ని ఎండగట్టారు.

Vanga Geetha made key remarks against Telugu Desam Party

వైఎస్ ఛైర్మన్ ప‌ద‌వి కోసం తెలుగుదేశం పార్టీ ఇన్ని కుట్ర‌లు చేయాలా అంటూ నిలదీశారు. తుని మున్సిపల్ కౌన్సిల్‌లో తమ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంద‌ని, అధికారం మారడంతో చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని సంకీర్ణ కూట‌మి ప్ర‌భుత్వం అనేక రకాల కుట్రలకు పాల్పడుతోందంటూ మండిపడ్డారు.

మున్సిపాలిటీలో ఉన్న మొత్తం 30 మంది కౌన్సిలర్లల్లో తమకు 28 మంది బలం ఉందని, సంపూర్ణ మద్ధతు ఉన్నప్పటికీ తెలుగుదేశం వారిని ప్రలోభాలు భయాందోళనలుక గురి చేసేలా కుట్ర రాజకీయాలు చేయడం సరికాదని వంగా గీత అన్నారు. పోలీసులు సైతం తమ పార్టీ నాయకులపై ఎక్కడా లేని ఆంక్షలు విధిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు.

తుని మున్సిపల్ చైర్ పర్సన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, తామంతా ఆమెను పరామర్శించడానికి అనుమతి ఇవ్వాలంటూ జిల్లా పోలీసు అధికారులను తాము ముందుగానే విజ్ఞప్తి చేసినప్పటికీ వాళ్లు అంగీకరించట్లేద‌ని వంగా గీత వ్యాఖ్యానించారు. వైస్ చైర్మన్ ఎన్నిక ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో పారదర్శకంగా జరగాల‌ంటూ డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలను కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తప్పుపట్టారు. తమకు మెజారిటీ వచ్చేంత వరకు వైస్ ఛైర్మన్ ఎన్నికను వాయిదా వేయించడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ధ్వ‌జ‌మెత్తారు. తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఏ మాత్రం మెజారిటీ లేద‌ని అన్నారు.

బీసీ మహిళ అయిన మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి ఇంటిపై దాడిచేసి తిరిగి ఆమెపైనే అక్రమ‌ కేసు పెట్టారని దాడిశెట్టి రాజా విమర్శించారు. కలెక్టర్, ఎస్పీలకు తుని నియోజకవర్గంపై ఎలాంటి పట్టు లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటింగ్‌కు వెళ్లిన తమ పార్టీ కౌన్సిలర్లపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారని, దీనితో వాళ్లు వెనక్కి వచ్చార‌ని గుర్తు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+