ఆత్మహత్యలు వద్దు: కాపులకు వంగవీటి రాధా వినతి, ముద్రగడపై నాదెండ్ల నో కామెంట్
కాకినాడ/ హైదరాబాద్: కాపులను బీసీలో చేర్చాలని కోరుతూ కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న మెకానిక్ వెంకట రమణమూర్తి కుటుంబ సభ్యులను మంగళవారం వైయస్సార్ కాగ్రెసు పార్టీ నేత వంగవీటి రాధ పరామర్శించారు.
కాపు సోదరులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. ఎవరు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని అన్నారు. దీన్ని శవరాజకీయం చేయవద్దని రాధ విజ్ఞప్తి చేశారు.

కాపు గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో చోటు చేసుకున్న సంఘటనలపై స్పందించడానికి మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నిరాకరించారు. ప్రస్తుతం స్పందించలేనని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు మీడియాను పిలిచి మాట్లాడుతానని అన్నారు.
ఓటు వేయబోమనే భావన మంచిది కాదని ఆయన అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆయన మంగళవారంనాడు జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్క ఓటరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications