రేపు ముగియనున్న జగన్ పాదయాత్ర: వంగవీటి రాధా అలక, ఆహ్వానం లేదా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనవరి 9వ తేదీతో ముగియనుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో భారీ బహిరంగ సభతో ముగించాలని వైసీపీ భావిస్తోంది. జగన్ ఏడాదికి పైగా పాదయాత్ర చేశారు. పాదయాత్ర ద్వారా వైసీపీకి మంచి మైలేజ్ వచ్చిందని భావిస్తున్నారు.
జగన్ పాదయాత్ర చివరి రోజు వైసీపీకి చెందిన కీలక నేతలు అందరూ పాల్గొననున్నారు. ఈ సమయంలో విజయవాడకు చెందిన వంగవీటి రాధా అలకపాన్పు ఎక్కారని తెలుస్తోంది. ఓ వైపు వైసీపీ అంతా జగన్ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఉత్సాహంలో ఉంటే రాధా మాత్రం దీనికి దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.

వంగవీటి రాధా గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో విభేదాల వల్లే ఆయన దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే వంగవీటి రాధా అసంతృప్త నేపథ్యంలో పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు. అయితే ఆయనను ఆహ్వానించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications