బొప్పన భవకుమార్‌తో వంగవీటి రాధ భేటీ: టీడీపీలోకి ఆహ్వానం
విజయవాడ: బెజవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా, అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ.. భవ కుమార్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
గతంలో ఇద్దరి మధ్య పాత పరిచయాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై సుమారు గంటకుపైగా చర్చించారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న భకుమార్ తెలుగుదేశం పార్టీలో చేరిక ఖాయంగా కనిపిస్తోంది.

కాగా, శనివారం ఉదయం భవకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ వీడొద్దంటూ తనపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నేలతోనూ సంప్రదిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో మాట్లాడి నిర్ణయం చెబుతానన్నారు. వైసీపీని వీడేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భవకుమార్.. 2019 నుంచి వైసీపీ విజయవాడ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాగా, పార్టీ వీడొద్దంటూ భవకుమార్ వద్దకు దేవినేని అవినాష్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, వారి ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications