సీఎం జగన్‌పై దాడి ఘటనపై సంచలన కామెంట్స్ చేసిన వంగవీటి రాధా

సీఎం జగన్‌పై రాళ్ల దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. బస్సుయాత్రలో భాగంగా గత శనివారం సీఎం జగన్‌పై రాయితో దాడి జరిగింది.బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు.రాయి తగలడంతో సీఎం జగన్‌ ఎడమ కనుబొమ్మపై గాయమైంది. కరెంట్ లేని సమయం చూసి సీఎం జగన్‌పై ఆగంతకులు దాడికి పాల్పడ్డారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ఈ ఘటన చోటు చేసుకుంది. జగన్‌కు వస్తోన్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతోనే ఈ దాడి చేశారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీ వారే ఇలా దాడులు చేయించుకుని సింపతి క్రియేట్ చేసుకుంటున్నారని ప్రతిపక్ష నేతలు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ నేత వంగవీటి రాధా స్పందించారు. తమ సొంతగడ్డ విజయవాడలో ఇలాంటి దొంగ దాడి ఎవరూ చేయరని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు.

vangaveeti radha shocking comments on CM Jagan stone attack

తమవారు ఏదైనా నేరుగానే చేస్తారని.. ఇది ఇక్కడివారి పని కాదని ఆయన తెలిపారు. సీఎం జగన్‌పై దాడి ఘటనపై వంగవీటి రాధా స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాధా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక 2024 ఎన్నికల్లో కూడా రాధా పోటీకి దూరంగా ఉంటున్నారు.

2019 ఎన్నికల ముందు వైసీపీలో ఆశించిన టికెట్ దక్కలేదని ఆశ్చర్యకరంగా ఆయన టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూడా రాధాకు టికెట్ ఇవ్వలేదు. కాగా, ఈ ఎన్నికల్లోనూ రాధాకు టీడీపీ టికెట్ కేటాయించలేదు. విజయవాడ సెంట్రల్‌లో మరోసారి బొండా ఉమాకే టీడీపీ టికెట్ ఇచ్చింది. తూర్పున గద్దె రామ్మోహన్‌ను బరిలో దింపింది. దీంతో రాధా మరోసారి రాజకీయ నిరుద్యోగిగా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+