Tulabhara Seva: అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రారంభించిన టీటీడీ, తిరుమలలో లాగా భక్తులు !

తిరుపతి/తిరుచానూరు/ తిరుమల: సిరుల‌త‌ల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న శుక్ర‌వారం వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హించారు.

ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేశారు. ఉద‌యం 10 గంటల నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణస్వామి ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిం,చారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా టికెట్ల‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో విక్రయించింది.

ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింత‌లు, కంక‌ణాలు, డ‌జ‌ను గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి తులాభారం ప్రారంభించారు. ఇకముందు తిరుమలతో పాటు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు తులాభారం ద్వారా వారి మొక్కులు చెల్లించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.

 అమ్మవారి ఆలయంలో ఈ రోజు ప్రారంభం

అమ్మవారి ఆలయంలో ఈ రోజు ప్రారంభం

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం తిరుమలలో కొన్ని దశాభ్దాల నుంచి భక్తులు వారి మొక్కులను తులాభారం ద్వారా తీర్చుకుని ఏడుకొండల స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. తిరుమల తరువాత తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పండుగ సందర్బంగా తులాభారం ప్రారంభం అయ్యింది. తిరుచానూరులోని శ్రీ అమ్మవారి ఆలయంలో ఇక ముందు తులభారం ద్వారా భక్తులు వారి మోక్కులు చెల్లించుకోవడానికి చక్కటి అవకాశం చిక్కింది.

 టీటీడీ చైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో

టీటీడీ చైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి తులాభారం ప్రారంభించారు. ఇకముందు తిరుమలతో పాటు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు తులాభారం ద్వారా వారి మొక్కులు చెల్లించుకునే అవకాశం ఉంది.

 అమ్మవారికి ప్రత్యేక పూజలు

అమ్మవారికి ప్రత్యేక పూజలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, మంత్రి వేణుగోపాల కృష్ణ, టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి తులాభార ప్రారంభించారు.

 తిరుమలలో లాగా తిరుచానూరులో తులాభారం

తిరుమలలో లాగా తిరుచానూరులో తులాభారం

తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టీటీడీ నిర్ణ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన శ్రీ జయచంద్ర దంపతులు రూ.17 లక్షల విలువైన తులాభారం ఆలయానికి బహూకరించారు.

శుక్రవారం జరిగిన తులాభారం కార్యక్రమంలో జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, అదనపు సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో శ్రీమతి క‌స్తూరి బాయి, ఏఈవో ప్రభాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+